“మహానటి” కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన కీర్తి సురేష్!
- April 13, 2017 / 10:08 AM ISTByFilmy Focus
నేను శైలజ మూవీతో తెలుగులో అడుగుపెట్టిన కీర్తి సురేష్.. తొలి చిత్రంతోనే హిట్ అందుకుంది. ఇక మలి చిత్రం నేను లోకల్ సూపర్ హిట్ కావడంతో ఆమె రెమ్యునరేషన్ కోటి నుంచి కోటిన్నరకు పెంచింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న మూవీలో కీర్తి నటిస్తోంది. ఇందుకోసం కోటిన్నర తీసుకుంటున్న కేరళ కుట్టీ.. తదుపరి చిత్రానికి మూడు కోట్లు అందుకుంటోంది. ఆశ్చర్యంగా ఉందా.. ఇది నిజం. తెలుగువారు గర్వించదగ్గ అభినేత్రి సావిత్రి జీవితంపై యువ దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్నారు.
ఈ చిత్రంలో మహానటిగా కీర్తి సురేష్ నటించనుంది. ఇందుకోసం ఆమె మూడు కోట్లు డిమాండ్ చేసిందంట. ఎందుకంటే ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుండడంతో ఇంత డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆమె అడిగినంత నిర్మాతలు అశ్వినీదత్, స్వప్నదత్ ఇచ్చిన్నట్లు సమాచారం. ఇంతవరకు బాగానే ఉంది. దీని తరవాత డేట్స్ కోసం వస్తున్న తమిళ నిర్మాతలకు కూడా ఇదే రేట్ చెబుతుండడంతో షాక్ తింటున్నారు. తమిళ సినిమాలు తెలుగులోనూ మంచి విజయం సాధిస్తున్నాయి. కావున మూడు కోట్లు కావాల్సిందేనని చెబుతుందంట. అలనాటి నటి మేనక కూతురికి బాగానే ట్రైనింగ్ ఇచ్చిందని తమిళ నిర్మాతలు చెప్పుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














