కొన్ని సినిమాలు వినేటప్పుడు సరిగ్గా ఆడదు అనుకుంటారు. కానీ థియేటర్లలోకి వచ్చేటప్పుడు చూస్తే అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. అందుకే గత సినిమా సరిగ్గా లేదనో, లేక మంచి విజయం దక్కినా డబ్బులు రాలేదనో వదిలేయకూడదు. ఎందుకంటే ఏ కథకు, ఆ కథే. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా? తనతో చేసిన ఓ సినిమా విజయం అందుకోలేదని, తర్వాత మరో కథ చెబితే ఓకే చేయకుండా బ్లాక్‌బస్టర్ సినిమా వదులుకున్నాడు ఓ స్టార్ హీరో.
Mahesh Babu
ప్రభాస్ (Prabhas) కెరీర్‌ను బ్లాక్‌బస్టర్ మలుపు తిప్పిన సినిమా ‘వర్షం’ (Varsham) . హిట్ సినిమాలు అప్పుడప్పుడు చేస్తున్న సమయంలో ఏకంగా కెరీర్ బెస్ట్ ఇచ్చిన ఆ సినిమాకు దర్శకుడు దివంగత శోభన్ (Sobhan) అనే విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కథను అంతకుముందు మహేష్‌బాబుకు చెప్పారట. అయితే ఎందుకోకానీ ఆయన ఓకే చేయలేదట. అంతకుముందు వారిద్దరి కాంబినేషన్‌లో ‘బాబీ’ సినిమా వచ్చిన ఇబ్బందికర ఫలితం అందుకున్న విషయం తెలిసిందే.
ఎం.ఎస్.రాజు (M. S. Raju) నిర్మించిన ‘వర్షం’ సినిమా20 ఏళ్లు అయిపోయింది. 2004 జనవరి 14న సంక్రాంతికి కానుగా వచ్చిన ఈ సినిమా సెంచరీ కొట్టింది కూడా. అప్పట్లో ఆ ఆప్షన్ ఉండేదిలెండి. ఇప్పుడు ఓటీటీకి ఇచ్చేసి.. ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా థియేటర్లలో తీసేస్తున్నారు. ఆ రోజుల్లో 125 కేంద్రాలలో 50 రోజులు, 95 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 24 కేంద్రాలలో175 రోజులు ఆడింది.
ఇన్ని రికార్డులు, భారీ వసూళ్లు ప్రభాస్ ఖాతాలో కాకుండా.. మహేష్ (Mahesh Babu) ఖాతాలో పడాల్సింది. అన్నట్లు ఈ సినిమా విజయం చేయకపోయి ఉంటే ప్రభాస్ కెరీర్ కూడా ఇబ్బందికరంగానే ఉండేదేమో. ఎందుకంటే ‘వర్షం’ సినిమా ముందు ప్రభాస్‌కు సరైన విజయం లేదు. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు చేసి, భారీ విజయాలు కూడా అందుకున్నాడు. కాబట్టి మహేష్‌కు (Mahesh Babu) రావాల్సిన సినిమా ప్రభాస్‌కి వచ్చి మంచి కెరీర్ రావడానికి కారణమైంది.