మంచు మోహన్ బాబుకి (Mohan Babu) ముగ్గురు సంతానం. తన మొదటి భార్య విద్యా దేవి ద్వారా మంచు లక్ష్మి, మంచు విష్ణు (Manchu Vishnu) జన్మించారు. రెండో భార్య నిర్మలా దేవి ద్వారా మంచు మనోజ్ (Manchu Manoj) జన్మించాడు. సొంత అన్నదమ్ములు కాకపోయినా విష్ణు, మనోజ్, లక్ష్మీ (Manchu Lakshmi) ..లు బాగానే కలిసుండే వారు. ముఖ్యంగా లక్ష్మీ తమ్ముడు మనోజ్ ను చాలా బాగా చూసుకుంటుంది. అయితే ఎక్కడా తేడా కొట్టిందో తెలీదు ప్రస్తుతం మనోజ్, మోహన్ బాబు, విష్ణు..ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
Manchu Family
అది కూడా ఆస్తుల విషయంలో, ఆధిపత్యం విషయంలో..! పోలీస్ స్టేషన్ మెట్లెక్కే వరకు మాత్రమే కాదు మీడియా ముందు కూడా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకునే స్థాయికి వీరి గొడవలు వెళ్లాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతా దీని గురించే చర్చ జరుగుతుంది. అసలు ఈ గొడవలు ఎందుకు మొదలయ్యాయి? ఎప్పుడు ముగుస్తాయి? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికైతే సమాధానాలు లేవు. రాబోయే రోజుల్లో వీటికి క్లారిటీ రావచ్చు.
ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. మంచు ఫ్యామిలీలోని (Manchu Family) గొడవలను ‘ఓ దర్శకుడు ముందుగానే ఊహించినట్టు ఉన్నాడు’ అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. వివరాల్లోకి వెళితే.. 2014 లో ‘పాండవులు పాండవులు తుమ్మెద’ (Pandavulu Pandavulu Tummeda) అనే సినిమా వచ్చింది. ఇందులో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్..లు కూడా హీరోలుగా నటించారు. ఈ సినిమా కథ ప్రకారం ‘మొదట్లో వీళ్ళకి అస్సలు పడదు’ అన్నట్టు చూపించారు.
దీనికి శ్రీవాస్ (Sriwass Oleti) దర్శకుడు. ఇంటర్వెల్ టైం వరకు వీళ్ళ మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. వాటికి సంబంధించిన విజువల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ..ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ‘మంచు ఫ్యామిలీలో (Manchu Family) గోడలని దర్శకుడు శ్రీవాస్ ముందే ఊహించినట్టు ఉన్నాడు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.