ఆ విషయంలో నేను చాలా లక్కీ : మంచు విష్ణు
- March 17, 2021 / 07:43 PM ISTByFilmy Focus
టాలీవుడ్ లో టాలెంట్ పుష్కలంగా ఉన్నా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాని హీరోలలో నవదీప్ ఒకరు. మోసగాళ్లు సినిమాలో నవదీప్ కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో మంచు విష్ణుతో కలిసి నవదీప్ పాల్గొన్నారు. ఇంటర్వ్వూలో నవదీప్ గురించి మంచు విష్ణు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవదీప్ తన దృష్టిలో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అని విష్ణు పేర్కొన్నారు. నవదీప్ ప్రతిభకు తగిన గుర్తింపు ఇప్పటికీ రాలేదని..
నవదీప్ కు ఉన్న సామర్థ్యానికి ప్రస్తుతం ఉన్న గుర్తింపు నథింగ్ అంటూ విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలో నవదీప్ నటించాడు కాబట్టి నవదీప్ ను ప్రశంసిస్తూ తాను కామెంట్లు చేయడం లేదని విష్ణు వెల్లడించారు. అయితే నవదీప్ కు కొన్ని దరిద్రమైన అలవాట్లు ఉన్నాయని విష్ణు తెలిపారు. మనం నవదీప్ కు ఐదుసార్లు ఫోన్ కాల్ చేస్తే నవదీప్ ఒక్కసారి కూడా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడని నవదీప్ కు అలాంటి దరిద్రమైన అలవాట్లు ఉన్నాయని విష్ణు వెల్లడించారు.

నవదీప్ కు యాక్టింగ్ తో పాటు రైటింగ్ పై కూడా మంచి గ్రిప్ ఉందని.. ఆ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని విష్ణు అన్నారు. నవదీప్ దగ్గర చాలా ప్రతిభ ఉందని.. నవదీప్ ఎంతో ఎఫర్ట్ పెట్టి పని చేస్తాడని విష్ణు పేర్కొన్నారు. నవదీప్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మోసగాళ్లు సినిమాలో ఫైట్లు, కామెడీ, పాటలు ఉండవని విష్ణు తెలిపారు. ఈ నెల 19వ తేదీన మోసగాళ్లు సినిమా విడుదల కానుండగా ఈ సినిమా విష్ణు, నవదీప్ లకు మంచి పేరు తెచ్చిపెడుతుందేమో చూడాలి.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!
















