మలయాళ సినీ పరిశ్రమలో హేమా కమిటీ రిపోర్ట్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడ ఫిమేల్ ఆర్టిస్ట్..లు ఎదుర్కొంటున్న సమస్యలను తెరపైకి తీసుకొచ్చింది హేమా కమిటీ రిపోర్ట్. ‘ఇండస్ట్రీలో మహిళలపై Laiగిక దాడులు చేస్తున్నారని, షూటింగ్ స్పాట్లో షాట్ గ్యాప్ లో మహిళలకు మంచినీళ్లు కూడా ఇవ్వరని, జూనియర్ ఆర్టిస్ట్..లు గాయపడితే చికిత్స అందించే వారు కూడా ఉండరని..! గతంలో ఓ సందర్భంలో లిఫ్ట్ లో ఉన్నప్పుడు తనతో ఓ సీనియర్ నటుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని, తర్వాత మోహన్ లాల్ కి (Mohanlal) ఆ విషయం చెబితే..
Mohanlal
అతను సపోర్ట్ చేసినట్టు నటించి.. తర్వాత అవకాశాలు రాకుండా చేసారని’ సీనియర్ నటి ఉష చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘అమ్మ’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) బోర్డు పదవుల్లో ఉన్న వాళ్ళు తమ పదవులకు రాజీనామా చేస్తున్న సందర్భాలు కూడా అందరికీ తెలుసు. అందులో మోహన్ లాల్ కూడా ఉన్నారు. తాజాగా ఆయన మీడియాతో ఈ విషయం పై ముచ్చటించడం జరిగింది. హయత్ రీజెన్సీలో కేరళ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన తర్వాత మోహన్‌లాల్ మీడియాతో ముచ్చటించడం జరిగింది.
ఆయన మాట్లాడుతూ..” ‘అమ్మ (మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అనేది కేవలం ట్రేడ్ యూనియన్ కాదు. ఇది కుటుంబం లాంటిది. ‘అమ్మ’ కోసం ఎన్నో మంచి పనులు చేశాం. మలయాళ సినీ పరిశ్రమలో పరిస్థితి మెరుగ్గానే ఉంది.దయచేసి మా ఇండస్ట్రీ పరువు తీయకండి. దీనిపై ఫోకస్ చేయొద్దని మీడియా వారిని వేడుకుంటున్నాను. హేమ కమిషన్ పై విచారణ జరుగుతుంది.
తీర్పు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నాను.ఒక నటుడిగా నిర్మాతగా నా హోదాలో 2సార్లు హేమా కమిషన్‌కు నా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. కమిటీ రిపోర్ట్‌ను నేను కూడా స్వాగతిస్తున్నాను. మహిళలపై Laiగిక దాడులు చేసేవారిని కచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. పోలీసులకు కూడా మేము సహకరిస్తాం” అంటూ మోహన్ లాల్ చెప్పుకొచ్చారు.