అక్కినేని నాగచైతన్య ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అక్కినేని హీరోలకు సినిమాలతో పాటు రేసింగ్ అంటే చాలా ఇష్టం అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగచైతన్య హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ (హెచ్‌బీబీ) రేసింగ్ టీమ్‌కు ఓనర్‌గా మారాడు. మోటర్ రేసింగ్ గేమ్‌లో భాగమవ్వాలనే తన కల ఈ రూపంలో తీరడం ఆనందంగా ఉందని చైతూ పేర్కొన్నాడు. రేసింగ్ అంటే ఎంతో ఆసక్తి కలిగినటువంటి యువతి యువకులకు హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ చక్కటి వేదిక అవుతుందని చైతూ తెలిపాడు.
ఈ ఏడాది జరుగనున్న ఫార్ములా 4 ఇండియన్ చాంఫియన్‌షిప్ లో నాగచైతన్య టీమ్ పోటీపడబోతుంది. నాగచైతన్య టీమ్‌కు అఖిల్ రబీంద్ర, నీల్ జానీ డ్రైవర్స్‌గా వ్యవహారించనున్నారు. ఇలా నాగచైతన్య రేసింగ్ టీం ఓనర్ గా ఈసారి తన టీం ను బరిలోకి దింపబోతున్నారని తెలుస్తుంది. మొదటి నుంచి అక్కినేని హీరోలు ఇలాంటి వాటిపై ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారనే సంగతి తెలిసిందే.
గత కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన రేసింగ్ గేమ్స్‌లో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ సందడి చేశారు. ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఈ సినిమా అనంతరం నాగచైతన్య (Naga Chaitanya) తన తదుపరి చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో నాగచైతన్య జాలరి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా జరుగుతున్నట్టు సమాచారం.