‘గుంటూరు కారం’ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. అయితే మొదటి షోతోనే ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. కొంతమంది సినిమా బాగుంది అన్నారు. ఇంకొంతమంది బాలేదు అన్నారు. ఇంకొంతమంది యావరేజ్ అన్నారు. అయితే టాక్ తో సంబంధం లేకుండా ‘గుంటూరు కారం’ సినిమాకి మొదటి రోజు భారీ కలెక్షన్స్ వచ్చాయి. ముందు నుండి ఈ సినిమా పై ఉన్న హైప్ అలాంటిది. త్రివిక్రమ్- మహేష్ బాబు.. కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఏదేదో ఊహించుకుని ధియేటర్ కి వస్తారు.
ఆ రేంజ్లో కంటెంట్ లేకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అది పక్కన పెట్టేస్తే.. ఈరోజు ‘గుంటూరు కారం’ సినిమాకి సంబంధించి నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగా నాగవంశీ మాట్లాడుతూ.. ” ‘గుంటూరు కారం’ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. మార్నింగ్ షోలకు నెగిటివ్ టాక్ వచ్చింది. తర్వాత అది మిక్స్డ్ టాక్ గా కన్వర్ట్ అయ్యింది. ఆ తర్వాత ఎక్కువ మంది బాగుంది అని చెబుతున్నారు.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ‘గుంటూరు కారం’ బాగుంది అంటున్నారు. సో అందరూ ఫ్యామిలీస్ తో వెళ్లి ఈ సినిమాని చూడండి.. మీకు నచ్చుతుంది. నెగిటివ్ టాక్ ను పట్టించుకోకుండా థియేటర్ కి వెళ్తే.. ఈ పండుగకి ఎంజాయ్ చేస్తారు. మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు కూడా బుకింగ్స్ బాగున్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దిల్ రాజు మాట్లాడుతూ.. ” ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా స్లోగా పికప్ అయ్యింది.
నిన్న మార్నింగ్ షోలకు ఒక రకమైన టాక్ ఉంది. సాయంత్రానికి 5 గురిని అడిగితే అందులో 3 మంది సినిమా బాగుంది అని చెప్పారు. సో పికప్ అయ్యింది. మొదటి రోజు మహేష్ బాబు గారి కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ని సాధించింది. పండుగకి కచ్చితంగా మంచి నంబర్స్ వస్తాయి. కలెక్షన్స్ ఎక్కువ సాధించిన సినిమా హిట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని సినిమాలు కూడా ఈ పండుగకి బాగా ఆడతాయి” అంటూ చెప్పుకొచ్చాడు.