మహేష్ సినిమాల సెలక్షన్ లో నాకు ఎలాంటి సంబంధం లేదు
- February 15, 2020 / 11:24 AM ISTByFilmy Focus
మహేష్-నమ్రతను స్వీట్ కపుల్ ఆఫ్ టాలీవుడ్ అని అందరూ అంటారు. అదే జనాలు మహేష్ కెరీర్ ను మొత్తం కంట్రోల్ చేసేది నమ్రతే అని కూడా అంటూ ఉంటారు. ఈ విషయమై మహేష్ కానీ, నమ్రత కానీ ఇప్పటివరకూ స్పందించలేదు. దాంతో అదే నిజమేమో అని అల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు.

అయితే.. ఇటీవల ఓ నేషనల్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. “మహేష్ బాబు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ వరకు నేను చూసుకుంటాను కానీ.. ఆయన సినిమాల విషయంలో నేను ఏ రకంగానూ ఇన్వాల్వ్ అవ్వను. ఆయన సినిమాల స్క్రిప్త్స్ నేను సెలక్ట్ చేసి ఫైనల్ చేస్తాను అనేవి అన్నీ రూమర్స్. ఒకవేళ నేను ఆయన సినిమాల కథలు ఎంపిక చేసి ఉంటే నా కెరీర్ స్టార్టింగ్ లో నేను చేసిన పిచ్చి సినిమాల్లా ఉండేవి ఆయన సినిమాలు కూడా” అంటూ చెప్పుకొచ్చింది. దాంతో.. మహేష్ సినిమా కెరీర్ లో నమ్రత ఇన్వాల్వ్ మెంట్ లేదని క్లారిటీ వచ్చింది జనాలకి.
Most Recommended Video
వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!
















