మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) , దర్శకధీరుడు రాజమౌళి(S. S. Rajamouli) … ఈ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR Movie). 2018 చివర్లో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్టు… కోవిడ్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చి.. మొత్తానికి 2022 మార్చి 25న రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదట కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా సరే సినిమాలో మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని సంతృప్తిపరిచే ఎలిమెంట్స్ ఉండటం.. వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకుంది.
ఆ టైంకి తెలుగు వెర్షన్ పరంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ఇది. అలా అని ఓవరాల్ గా ‘బాహుబలి 2’ కలెక్షన్లను అధిగమించలేదు. అయితే తర్వాత జపాన్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. తర్వాత ఆస్కార్ అవార్డులు దక్కించుకుని గ్లోబల్ రికగ్నైజేషన్ తెచ్చుకుంది. 5 కి పైగా నేషనల్ అవార్డులు కూడా అందుకుంది. ఈ సందర్భంగా ఒకసారి ‘ఆర్.ఆర్.ఆర్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 112.13 cr |
సీడెడ్ | 50.66 cr |
ఉత్తరాంధ్ర | 33.30 cr |
ఈస్ట్ | 16.40 cr |
వెస్ట్ | 13.30 cr |
గుంటూరు | 18.17 cr |
కృష్ణా | 14.70 cr |
నెల్లూరు | 09.42 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 268.08 cr |
తమిళనాడు | 38.50 cr |
కేరళ | 10.80 cr |
కర్ణాటక | 44.42 cr |
హిందీ | 134.30 cr |
ఓవర్సీస్ (చైనాతో కలుపుకుని) | 182.23 cr |
రెస్ట్ | 10.05 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 678.73 cr (అన్ని వెర్షన్లు కలుపుకుని) |
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం రూ.500 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.678.73 కోట్ల భారీ షేర్ ను సాధించింది.గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.1271.21 కోట్లు కొల్లగొట్టింది.