రాబిన్ హుడ్ (Robinhood) అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో నితిన్ (Nithiin) మళ్లీ తన కెరీర్ గట్టెక్కించేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తూ “తమ్ముడు”(Thammudu) సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. రాబిన్ హుడ్‌లో సెకండ్ హాఫ్ డ్రాగ్ కావడంతో ఫలితాన్ని ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీరామ్ వేణు (Venu Sriram) దర్శకత్వంలో వస్తున్న “తమ్ముడు” చిత్రం మాత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా కోసం నితిన్ ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎంతో ప్రిపేర్ అయ్యాడని టాక్.
టైటిల్ నుంచే పర్సనల్ కనెక్షన్ ఉన్నట్లు భావిస్తున్న నితిన్, సినిమా టైమ్‌లో అభిమానుల్లో మరింత హైప్ తీసుకురావాలని చూస్తున్నాడు. “తమ్ముడు” అనే టైటిల్ పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) సంబంధించిన హిట్ ను గుర్తు చేస్తోంది. అదే స్థాయిలో ఫ్యామిలీ లవర్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా కథను డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇప్పుడు సినిమా క్లైమాక్స్‌పై మేజర్ ఫోకస్ పెట్టడం విశేషం. లేటెస్ట్ బజ్ ప్రకారం తమ్ముడు చివరి 20 నిమిషాలు సినిమాకే అసలైన ప్రాణంగా నిలవబోతున్నాయని తెలుస్తోంది.
అక్కచెల్లెళ్లు – తమ్ముళ్ల మధ్య ఉండే ఎమోషనల్ ట్రాక్‌కి అద్భుతమైన ముగింపు ఉండబోతుందని చెబుతున్నారు. దీనికితోడు వైజాగ్‌లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగా పని చేస్తుందని టీమ్ అంతా నమ్మకం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో సప్తమిగౌడ (Sapthami Gowda) హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ లయ (Laya) ఓ కీలక పాత్రలో రీ ఎంట్రీ ఇస్తోంది.
‘వకీల్ సాబ్’ (Vakeel Saab) తరవాత డైరెక్టర్ శ్రీరామ్ వేణు తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమా మే 9న విడుదల కావొచ్చని టాక్. అజనీష్ లోక్‌నాథ్ (B. Ajaneesh Loknath) సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి టెక్నికల్ స్ట్రెంగ్త్‌గా నిలవనున్నాయి. మొత్తం మీద నితిన్ కెరీర్‌లో మరో కీలక మలుపు అవ్వబోయే తమ్ముడు సినిమా నిజంగా ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.