‘అఖండ’ కి ముందు పదేళ్లలో చూసుకుంటే.. బాలకృష్ణ (Balakrishna) వరుసగా హిట్లు కొట్టిన సందర్భాలు తక్కువ. అలాంటి ట్రాక్ రికార్డ్ ని.. బ్రేక్ చేసి బాలకృష్ణకి ఓ మంచి మాస్ హిట్ ఇచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) . ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). నవీన్ ఎర్నేని, (Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar) ..లు కలిసి ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
Balakrishna
2023 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా..చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాతో పోటీపడి మరీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది ఈ సినిమా.’వీరసింహారెడ్డి’ లో ప్రధానంగా పెద్ద బాలకృష్ణ పాత్రని గోపీచంద్ మలినేని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. హోమం సీన్ విజువల్స్ కావచ్చు, ఆ తర్వాత టెంపుల్ వద్ద జీప్ దిగి జనాలని పలకరించే సీన్ కావచ్చు.. మాస్ ఆడియన్స్ కి ముఖ్యంగా నందమూరి అభిమానులకు మంచి హై ఇచ్చాయి అని చెప్పాలి.
అందుకే కొన్ని ఏరియాల్లో ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది. ఇదిలా ఉంటే.. గోపీచంద్ మలినేని పనితనానికి మెచ్చి హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అతనికి మరో ఛాన్స్ ఇచ్చాడట. ‘ఎస్.ఎల్.వి.సినిమాస్’ బ్యానర్లో బాలకృష్ణ ఓ సినిమా చేయాలి. అందుకు గోపీచంద్ మలినేని కథకి ఓకే చెప్పాడట బాలయ్య. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది అని వినికిడి. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.