పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఇప్పుడు కచ్చితంగా ఒక హిట్టు కొట్టాల్సిన పరిస్థితి. ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న పూరీ జగన్నాథ్.. అటు తర్వాత ‘లైగర్’ (Liger) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి 2 డిజాస్టర్లు ఇచ్చాడు. ఈ 2 సినిమాలు బయ్యర్స్ ను ముంచేశాయి. అందుకే పూరి ప్రస్తుతం ముంబైలోనే ఉంటున్నారు. ఓ ప్రాజెక్టు సెట్ అయితేనే కానీ ఆయన హైదరాబాద్ కి వచ్చేలా లేరు. మరోపక్క పూరీ జగన్నాథ్ చాలా మంది హీరోలను సంప్రదిస్తున్నా..
ఎవరూ అంతగా ఆసక్తి కనబరచడం లేదు అని సమాచారం. కానీ పూరీ అంత వీక్ డైరెక్టర్ అయితే కాదు. ప్లాపుల్లో ఉన్న చాలా సార్లు పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో పూరీని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. అది అతనితో పనిచేసిన హీరోలకి బాగా తెలుసు.
అందుకే నాగార్జున (Nagarjuna).. పూరీ జగన్నాథ్ తో ఓ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. గతంలో నాగార్జున – పూరీ కాంబినేషన్లో ‘శివమణి’ ‘సూపర్’ (Super) వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ‘శివమణి’ మంచి విజయాన్ని అందుకుంది. ‘సూపర్’ అబౌవ్ యావరేజ్ అన్నట్టు ఆడింది. సో ఎలా చూసుకున్నా ఇది మంచి కాంబినేషనే. నిర్మాతలు, బయ్యర్స్ కూడా ఈ కాంబోపై ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఎటొచ్చి పూరీ మంచి స్క్రిప్ట్ తీసుకోవాలి. కచ్చితంగా అన్ని కమర్షియల్ లెక్కలు వేసుకుని హిట్ కథతో సెట్స్ పైకి వెళ్ళాలి. ఇక నాగార్జునకి కూడా పూరీ జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి పూరీ అయితేనే బెస్ట్ ఛాయిస్ అని నాగ్ కూడా భావిస్తున్నాడట.