ప్రముఖ సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ మీటింగ్ పెడితే లక్షల మంది జనాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఆ ప్రాంగణం మొత్తం జనాలతో నిండిపోతుంది. అంతమంది జనాలు పవన్ కళ్యాణ్ ని చూడడానికి వస్తారు కానీ ఆయనకు ఓటు మాత్రం వేయలేదు. అందుకే ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఈ విషయం గురించి బాలకృష్ణ తన ఇంటర్వ్యూలో పవన్ ని అడిగారు.
ఇంతమంది అశేష అభిమానులున్నప్పటికీ ఎందుకు ఓట్లు పడలేదని అడగ్గా.. దానికి పవన్ ‘నా ఫ్యాన్స్ అందరూ నాకు ఓటేయరు’ అని చెప్పారు. అభిమానం వేరు, అది ఓట్లు కింద మారడం వేరని అన్నారు. దాని కోసం దశాబ్దాలు కష్టపడాలని, సినీ రంగంలో పేరు తెచ్చుకోవడానికి తనకు దశాబ్దానికి పైగా సమయం పట్టిందని అన్నారు. రాజకీయ రంగంలో కూడా ఆ నమ్మకం తెచ్చుకోవడానికి అంతే కృషి చేయాలని అన్నారు. అప్పుడే అభిమానం ఓట్ల కింద మారుతుందని..
దానికి సమయం పడుతుందని అన్నారు. అలా ప్రజలకు మనపై నమ్మకం పెరగాలంటే గట్టిగా నిలబడాలని.. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవని అన్నారు. తక్కువలో తక్కువ దశాబ్దన్నర పడుతుందని అన్నారు. ప్రస్తుతానికి తనైతే నమ్మకం సంపాదించుకునే స్థితిలో ఉన్నానని చెప్పారు. ఇలా తన రాజకీయ పరిస్థితి గురించి వివరించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్-బాలకృష్ణ షోని రెండు పార్ట్ లుగా విడుదల చేశారు. పార్ట్ 1లో సినిమాలు, వ్యక్తిగత విషయాలు టచ్ చేసినప్పటికీ..
రెండో ఎపిసోడ్ లో మాత్రం రాజకీయాల గురించే మాట్లాడుకున్నారు. బాలయ్య కూడా రాజకీయ పరంగా పవన్ కి కావాల్సినంత హైప్ ఇవ్వడానికి ప్రయత్నించారు. నటులుగా పవన్, బాలయ్య ఇద్దరూ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు ఒప్పుకుంటూ.. తీరిక లేకుండా గడుపుతున్నారు.