మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్-రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు రూ.23 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణంగా రీమేక్ లకు ఇంత మొత్తంలో రేటు పలకదు.
అయితే ఒరిజినల్ నుండి లైన్ మాత్రం తీసుకొని.. చాలా వరకు మార్చేయడం, పైగా భారీ ఫైట్లు జోడించడం వంటి కారణాలతో ఈ రేట్లు పలికినట్లుంది. ఇప్పటివరకు తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులు ఈ రేంజ్ లో పలికింది లేదు. అప్పట్లో ‘వినయ విధేయ రామ’ సినిమా డబ్బింగ్ హక్కులను రూ.21 కోట్లకు అమ్మారు. ఇప్పుడు పవన్ సినిమా కోసం రూ.23 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చారు. ఇదిలా ఉండగా..
చిత్ర నిర్మాతలు డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం రూ.44 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం జీ సంస్థతో బేరసాగాలు సాగుతున్నాయి. మరి ఈ రేటు ఇంతకు తెగుతుందో చూడాలి. ఎలా చూసినా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.65 కోట్లు పలకడం ఖాయమని తెలుస్తోంది. ఇక థియేట్రికల్ రైట్స్ ఏ రేంజ్ లో పలుకుతాయో చూడాలి