జల్లికట్టు, కోడి పందేలపై నిషేధాన్ని ఎత్తివేయాలి
- January 20, 2017 / 09:35 AM ISTByFilmy Focus
తమిళనాడులో నిర్వహించే జల్లికట్టును, ఆంధ్రలో జరిపే కోడి పందేలపై కేంద్రం నిషేధం విధించడంపై సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన రీతిలో స్పందించారు. దక్షిణ భారతదేశం అంటే కేంద్రానికి చాలా చులకన భావం ఉందని ఆరోపించారు. అందుకే ద్రవిడ సంస్కృతి పై దాడికి దిగిందని స్పష్టం చేశారు. గోవు మాతను దైవంగా భావించే తమిళీయులు సంక్రాంతి నాడు పవిత్రంగా జరుపునే జల్లికట్టుపై నిషేధించడం చూస్తుంటే దక్షిణ భారతదేశాన్ని కేంద్రం ఎలా చూస్తుందో అర్థమవుతోందని వెల్లడించారు. దేశంలో జరుగుతున్న ఆవు, గేదె మాసం విక్రయాలను అదుపు చేయకుండా సాంప్రదాయ ఆటను కట్టడికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని నేడు ట్విట్టర్లో ఘాటుగా ప్రశ్నించారు.
తమిళనాడులో సినిమా చిత్రీకరణ సమయంలో దక్షిణ భారతాన్ని ఎలా అణచివేస్తున్నారో చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలాగే ఆంధ్రుల సంస్కృతిలో భాగమైన కోడి పందాలను బ్యాన్ చేయడం హాస్యాస్పదంగా ఉందని పవన్ ట్వీట్ చేశారు. కోడి పందేలను నిషేధించాలంటే ముందు పౌల్ట్రీ వ్యాపారాన్ని నిలుపు చేయాలనీ కేంద్రానికి చురకలు అంటించారు. జల్లికట్టు, కోడి పందేలపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















