Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’.. ఇది ఎన్నో రిలీజ్ డేటో తెలుసా? గతంలో..!
- September 25, 2024 / 09:49 AM ISTByFilmy Focus
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు శుభవార్త చెబుతూ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా టీమ్ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి పార్టు ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
Hari Hara Veera Mallu

తొలి భాగానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ జ్యోతి కృష్ణ (Jyothi Krishna ) దర్శకత్వంలో విజయవాడలో ప్రారంభమైంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. దీనికోసం కళా దర్శకుడు తోట తరణి ఆధ్వర్యంలో భారీ సెట్‌ను నిర్మించారు. అందులో పవన్‌తో పాటు 400 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్ట్‌లపై పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు కొత్త విడుదల తేదీతో ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చెప్పడం, వాయిదా వేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇదే జరిగింది. దీంతో కొంతమేర ‘డేట్ దగ్గరకు వచ్చినప్పుడు చూద్దాం’ అనే ధోరణి కూడా అభిమానుల్లో కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే పాత డేట్స్ చర్చకు తీసుకొస్తున్నారు. సినిమా టీమ్ తొలుత జనవరి 14, 2022న సినిమా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది.

ఆ తర్వాత ఆ డేట్ను ఏప్రిల్ 29, 2022కి మార్చారు. అక్కడికి కొద్ది రోజులకే ఏప్రిల్ కాదు.. మార్చి 30, 2023 అని చెప్పారు. ఇవేవీ జరగలేదు అనే విషయయం మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చెప్పిన మార్చి 28, 2025 గురించి పై చర్చ జరుగుతోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు.
















