ఆ మహనీయుడి చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన పాయల్
- November 26, 2018 / 06:55 AM ISTByFilmy Focus
“ఆర్ ఎక్స్ 100” విడుదలై సూపర్ సక్సెస్ సొంతం చేసుకోన్నప్పటికీ ఆ చిత్రంలో కథానాయికగా నటించడమే కాక తన నటనతో, గ్లామర్ తో సినిమా విషయంలో కీలకపాత్ర పోషించిన పాయల్ రాజ్ పుట్ కి మాత్రం తెలుగులో సరైన అవకాశం దొరకలేదు. ఆ సినిమాలో పోషించిన సెక్సిస్ట్ హీరోయిన్ లేదా సెకండ్ హీరోయిన్ రోల్సే ఆము వెతుక్కుంటూ వెళ్ళాయి తప్ప సరైన ఆఫర్ ఒక్కటి కూడా దొరకలేదు. దాంతో అంత పెద్ద హిట్ కొట్టినా ఫలితం లేకపోయిందని పాయల్ బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే.. ఎట్టకేలకు పాయల్ కు తన టాలెంట్ ను నిరూపించుకొనే అవకాశం వచ్చిందని తెలుస్తోంది. “ఎన్టీఆర్” బయోపిక్ లో జయప్రద పాత్ర పోషించే అవకాశం పాయల్ కి లభించింది. “అడవిరాముడు” చిత్రంలోని “ఆరేసుకోబోయి పారేసుకొన్నాను హరి” అనే పాటను బాలయ్య-పాయల్ కాంబినేషన్ లో తెరకెక్కించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం జనవరి 9న విడుదలవుతోంది.














