యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అయితే బాహుబలి కేవలం రాజమౌళి మేనియా మాత్రమే.. ప్రభాస్ కు అంత సీన్ లేదు అనుకున్న వాళ్ళు ‘సాహో’ చిత్రం ఫలితంతో షాక్ అయ్యారు. చెప్పాలంటే ఇది ప్లాప్ సినిమానే అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 430 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీంతో సినిమా యావరేజ్ లిస్టు లో చేరింది ‘సాహో’. ఇక ఇప్పుడు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘ప్రభాస్ 20’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్ కు కూడా 180 నుండీ 200 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఇదే ఎక్కువ అనుకుంటే… ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ ను మించి ‘ప్రభాస్ 21’ బడ్జెట్ ఉండబోతుంది అనేది తాజా సమాచారం. ‘ప్రభాస్ 21’ ను ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయబోతుండగా ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించనున్నారు. ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు బడా స్టార్ హీరోల మల్టీ స్టారర్ కు 400 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు నిర్మాత దానయ్య.
అయితే ‘ప్రభాస్ 21’ కు మాత్రం ఏకంగా 420 నుండీ 500 కోట్ల బడ్జెట్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ‘సైన్స్ ఫిక్షన్’ మూవీ కావడంతో వి.ఎఫ్.ఎక్స్ ను ఓ రేంజ్ లో ఉపయోగిస్తారని తెలుస్తుంది. అయితే నిజంగానే 500 కోట్ల బడ్జెట్ పెడితే.. థియేట్రికల్ రైట్స్ కనీసం 350 కోట్లకు అమ్ముడుకావాలి. హిందీ లో 100 కోట్లకు కొనుగోలు చేసే అవకాశం ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో కనీసం 200 కోట్లకు అమ్ముడుకావాలి. అంత పెట్టి కొంటారా. ఇది చాలా రిస్క్ అనే కామెంట్స్ అప్పుడే మొదలైపోయాయి.