కరోనా దెబ్బకు అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఇండియాకి కూడా ఈ వైరస్ పాకడంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. హైదరాబాద్ లో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్ లు లేకుండా బయటకి రావడం లేదు. తాజాగా హీరో ప్రభాస్ ఎయిర్ పోర్ట్ లో మాస్క్ తో కనిపించారు. తన ముక్కుకు ఎయిర్ ఫిల్టర్ మాస్క్ ధరించి ఫ్రాన్స్ కి బయలుదేరాడు ప్రభాస్.
అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే.. ఫ్రాన్స్ లో రెండు వందల మందికి పైగా కరోనా సోకింది. ఈ వ్యాధి కారణంగా అక్కడ నలుగురు చనిపోయారు. మరో ఎనిమిది మందికి సీరియస్ గా ఉంది. ఈ నేపధ్యంలో ప్రభాస్ అక్కడకి వెళ్తుండడంతో అభిమానులు భయపడుతున్నారు. షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు ఫారెన్ షూటింగ్ లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. కానీ ప్రభాస్ సినిమా ఇప్పటికే చాలా సార్లు షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ వాయిదా వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ నిర్వహించాలని భావిస్తోంది.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
Most Recommended Video
View this post on Instagram
#Prabhas spotted at hyd airport
A post shared by Filmy Focus (@filmyfocus) on
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!