‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) రిలీజ్ అయ్యి 6 రోజులు పూర్తి కావస్తోంది. వీక్ డేస్లో కూడా సినిమా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో సో సోగా ఉన్నా.. నార్త్, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో బాగా కలెక్ట్ చేస్తుంది.నార్త్ లో అయితే రోజుకో రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతుంది. బీహార్, జార్ఖండ్ వంటి ఏరియాల్లో ‘పుష్ప 2’ ఇప్పటికీ హౌస్ఫుల్స్ తో రన్ అవుతుంది. ఓవర్సీస్ లో కూడా ‘పుష్ప 2’ అదరగొట్టేస్తుంది అని చెప్పాలి. అక్కడ హిందీ వెర్షన్ కూడా బాగా కలెక్ట్ చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.409.07 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.195.93 కోట్ల షేర్ రావాలి.