Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajinikanth: 21 ఏళ్లుగా రహస్య సాధన.. అసలు గుట్టు విప్పిన రజినీకాంత్!

Rajinikanth: 21 ఏళ్లుగా రహస్య సాధన.. అసలు గుట్టు విప్పిన రజినీకాంత్!

  • February 8, 2025 / 04:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: 21 ఏళ్లుగా రహస్య సాధన.. అసలు గుట్టు విప్పిన రజినీకాంత్!

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) వయసు 74 దాటినా, ఆయనలోని ఎనర్జీ, యూత్‌ఫుల్ స్పిరిట్ చూస్తే అభిమానులు ఆశ్చర్యపోవడం సహజం. వరుస సినిమాలు, దేశవ్యాప్తంగా సంచలనం రేపే ప్రాజెక్టులు చేస్తూ, ఇప్పటికీ 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్‌గా కొనసాగుతున్నారు. అయితే రజనీ ఇలా ఫిట్‌గా ఉండటానికి కారణమేంటి? ఆరోగ్యంగా, ప్రశాంతంగా, అనవసర ఆందోళనల లేకుండా జీవితాన్ని ఆస్వాదించేందుకు ఆయన పాటించే ప్రత్యేకమైన పద్ధతి ఏంటో ఆయన స్వయంగా వెల్లడించారు. తన ఆరోగ్య రహస్యానికి గల కారణం క్రియా యోగా అని రజనీ స్పష్టంగా తెలిపారు.

Rajinikanth

Rajinikanth kriya yoga secret

అయితే ఇది సాధారణ సాధన కాదని, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి దాదాపు 10-12 సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చారు. “ఆరంభంలో నేనెన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఫలితమూ దక్కలేదు. కానీ ఓ దశలో నేను పూర్తిగా లయబద్ధమయ్యాను. ఇప్పుడు ప్రతిరోజూ ధ్యానం చేయడం నా జీవితంలో భాగమైంది” అని వివరించారు. 2002లో క్రియా యోగాను ప్రారంభించినప్పటికీ, దాని అసలు ప్రయోజనాన్ని పూర్తిగా అనుభవించేందుకు పదేళ్లు పట్టిందని ఆయన చెప్పిన మాటలు అభిమానుల్లో ఆసక్తిని పెంచేశాయి. ప్రస్తుతం రజనీకాంత్ రాంచీలోని వై.వై.ఎస్ ఆశ్రమాన్ని సందర్శిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పట్టుదల సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే?

అక్కడ ఆయన ప్రత్యేకంగా గురువులు ఉపదేశించిన యోగా, ధ్యాన సాధన చేయడం అలవాటుగా మార్చుకున్నారు. “ఈ ఆశ్రమంలో నేను మూడోసారి వచ్చాను. గతంలో ఇక్కడ ఒక గంట పాటు ధ్యానం చేశాను. ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం. ధ్యానం చేస్తున్నప్పుడు సమయమే కనబడదు. అంతగా మనస్సు స్థిరపడిపోతుంది” అని తెలిపారు. అయితే క్రియా యోగా ప్రభావాన్ని గురించి చెప్పిన రజనీ, “నన్ను కలిసినవారు నా దగ్గర నుంచి ఎంతో సానుకూలతను పొందుతామని చెబుతారు. దానికి కారణం ఇదే. ఇది ఓ రకమైన నిశ్శబ్ద సాధన.

ఇది చేసే వారికి మాత్రమే దీని ప్రభావం తెలుస్తుంది” అని వివరించారు. ఒకసారి గురువు చేతి పట్టుకుని మార్గం చూపిస్తే, ఆ మార్గం జీవితాంతం మారదని రజనీ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇప్పుడు కూడా రజనీ కూలీ  (Coolie), జైలర్ 2 వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నా, రోజూ ఈ సాధన చేయడం వల్ల తన ఎనర్జీ మారకుండా ఉంటుందని చెబుతున్నారు. 21 ఏళ్లుగా నిరంతరంగా క్రియా యోగాను కొనసాగిస్తున్న రజనీకాంత్, తన ఆరోగ్యానికి, ఉత్సాహానికి కారణం ఇదేనంటూ చెప్పడం మరోసారి ఆయన లైఫ్‌స్టైల్‌ మీద ఆసక్తిని పెంచింది.

 

View this post on Instagram

 

A post shared by Wow Tamizhaa (@wowtamofficial)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Rajinikanth

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Chiru – Kamal: రజనీకాంత్‌ అయిపోయారు.. ఇప్పుడు చిరంజీవితో ఓకే చెప్పించుకున్న కమల్‌

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

5 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

5 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

6 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

12 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

1 day ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version