‘ఏ క్షణాన ఏమి జరుగునో ఎవరూహించెదరు’ అనే పాట సినిమా పరిశ్రమలోని వారికి బాగా సూటవుతుంది. ఓ ఏడాది హిట్స్ తో రివ్వున దూసుకు పోతారు. మరో ఏడాది అపజయాలతో పాతాళానికి వెళ్ళిపోతారు. ఫిట్ బ్యూటీ విషయంలో ఇంచు మించు ఇలాగే జరిగింది. 2016 లో నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ వంటి విజయాలతో తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి చేరింది. 2017 లోను అదే జోరు ఉంటుందనుకుంది. కానీ “రారండోయ్ వేడుక చూద్దాం” మినహా చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ముఖ్యంగా మహేష్ ద్విభాషా చిత్రం స్పైడర్ ఆమె క్రేజ్ ని అమాంతం కిందకు దించింది. మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న స్పైడర్ ద్వారా కోలీవుడ్ లోను రకుల్ అదరగొట్టాలనుకుంది. కానీ అపజయం వెక్కిరించింది.
దీంతో ఉన్న అవకాశాలు కూడా పోయాయి. అందుకే ఈ బ్యూటీ బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం రకుల్ నటించిన హిందీ సినిమా “అయ్యారీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లో రకుల్ బిజీగా ఉంది. అంతేకాదు ఈ చిత్రం హిట్ అయిన, ఫ్లాప్ అయినా తన కెరీర్ కి ఢోకా ఉండకూడదని గ్లామర్ డోస్ పెంచింది. “మాగ్జిమ్” మేగజీన్ కోసం హద్దులు దాటుకొని.. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా స్కిన్ షో చేసింది. ఈ కవర్ పేజ్ హాట్ ఫోటో షూట్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ లుక్ తప్పకుండా ఆమెకు అవకాశాలు రప్పిస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.