మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సినీ కెరీర్ లో హిట్టైన సినిమాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. మగధీర (Magadheera) , రంగస్థలం (Rangasthalam) , ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమాలలో రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలో నటిస్తున్న చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
అయితే రామ్ చరణ్ కు మరో అరుదైన గౌరవం దక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. లండన్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. చరణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ చూసి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
రామ్ చరణ్ తన కుక్కపిల్ల రైమ్ ను ఎత్తుకుని ఉన్న మైనపు బొమ్మను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. వైరల్ అవుతున్న వార్తలు నిజమైతే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు 18 సంవత్సరాల సినీ కెరీర్ లో చరణ్ ఇప్పటివరకు కేవలం 15 సినిమాలలో మాత్రమే నటించారు.
రామ్ చరణ్ స్పీడ్ పెంచాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ఏడాదికి ఒక సినిమా అయినా కచ్చితంగా విడుదలయ్యేలా చరణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోయే రోజుల్లో ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి. రామ్ చరణ్ రాజమౌళి (Rajamouli) కాంబో రిపీట్ కావాలని కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.