ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం, ఆ తరుణంలో ఆయన తల్లిని అనరాని మాటలు అనడం తెలిసిందే. ఈ కథ అంతా నడిపించింది రాంగోపాల్ వర్మ అనే విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత టాలీవుడ్ మొత్తం మాత్రమే కాదు ఆయన శిష్యగణం కూడా ఆయన్ని తిట్టిపోసింది. ఆ క్రమంలో రాంగోపాల్ వర్మకు, ఆయన ప్రియ శిష్యుడు పూరీ జగన్నాధ్ కు కూడా పడడం లేదని, కనీసం మాటలు కూడా లేవని వార్తలొచ్చాయి.
అయితే.. ఈ వార్తలపై ఇమ్మీడియట్ గా స్పందించిన రాంగోపాల్ వర్మ, వెంటనే తన ట్విట్టర్ లో “మా మధ్య గొడవల్లేవ్.. అవన్నీ తప్పుడు వార్తలే” అని స్పందించాడు. మరి గొడవల్లేనప్పుడు ఇదివరకూ తన సినిమా ప్రమోషన్స్ కి పూరీ జగన్నాధ్ ఆఫీస్ను వాడిన వర్మ.. ఇప్పుడు ఎందుకు ఆ ఆఫీస్ కి దూరంగా ఉంటున్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి కూడా వర్మ దగ్గర తప్పకుండా ఏదో ఒక సమాధానం ఉంటుంది కాబట్టి.. దానికి కూడా ఏదో ఒక లాజిక్ చెబుతాడాయన.