మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) , స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) . బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘రైడ్’ కి రీమేక్ గా రూపొందింది ఈ సినిమా. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) సంగీతంలో రూపొందిన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.
Ravi Teja
టీజర్, ట్రైలర్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినప్పటికీ.. ఎందుకో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాకి నెగిటివ్ చెప్పారు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నప్పటికీ.. సెకండాఫ్ నిరాశపరిచినట్టు వారు పేర్కొన్నారు. అందువల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫలితం పూర్తిగా మారిపోయింది.
కనీసం ఆ టాక్ కి తగ్గ కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి రాలేదు. రూ.35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా రూ.8 కోట్ల షేర్ లోపే రన్ ను ముగించుకున్నట్టు ట్రేడ్ పండితుల సమాచారం. అంటే రూ.27 కోట్ల వరకు బయ్యర్స్ నష్టపోయినట్టే. ఇందులో చాలా వరకు నిర్మాతలు భరించాల్సిందే.
అందుకోసం దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే తన పారితోషికంలో రూ.2కోట్లు వెనక్కి ఇచ్చినట్టు సమాచారం. తాజాగా రవితేజ కూడా తన పారితోషికం రూపంలో అందుకోవాల్సిన బ్యాలన్స్ రూ.4 కోట్లు వదులుకున్నట్టు తెలుస్తుంది. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రానికి గాను రవితేజ (Ravi Teja) రూ.18 కోట్లు పారితోషికం అందుకున్నట్టు వినికిడి.