RRR Censor: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న్ ఆర్ఆర్ఆర్.. కానీ?

భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 1,000 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

రిలీజ్ కు 40 రోజుల ముందే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ కు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాలు అని సమాచారం. ఆర్ఆర్ఆర్ విజువల్స్ ను చూసి సెన్సార్ బోర్డ్ సభ్యులు ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సమాచారం.

సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయని రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్ ను సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారని బోగట్టా. ఎక్కువ భాషల్లో ఆర్ఆర్ఆర్ రిలీజవుతున్న నేపథ్యంలో ఇబ్బందులు రాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా పనులను వేగంగా పూర్తి చేస్తూ రాజమౌళి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన జనని సాంగ్ కు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. బాహుబలి2 సినిమాను మించి ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Share.