ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా… ఈ సినిమాలను పరిశీలిస్తే చంద్రశేఖర్ యేలేటి హీరోల కోసం కథను రాయకుండా.. కథలకు తగిన ఆర్టిస్టులను వెతుక్కుంటారని స్పష్టంగా అర్ధమవుతుంది. అటువంటి డైరక్టర్ దర్శకత్వంలో నటించే అవకాశం రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ అవకాశం సాయి ధరమ్ తేజ్ కి వరించింది. పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో విజయాలను అందుకున్న మెగా హీరో… ఆ తర్వాత చేసిన తిక్క, విన్నర్, నక్షత్రం సినిమాలు నిరాశ పరిచాయి. బీవీఎస్ రవి దర్శకత్వంలో నటించిన జవాన్ కూడా ఆశించినంత హిట్ సాధించలేకపోయింది.
దీంతో ఆశలన్నీ వివి వినాయక్ పై పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మించిన “ఇంటిలిజెంట్” రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో నటించనున్నారు. రిలీజ్ కానున్న, సెట్స్ పైకి వెళ్లనున్న సినిమాలకంటే చంద్రశేఖర్ యేలేటి ప్రాజక్ట్ ఓకే అవ్వడాన్ని మెగా అభిమానులు ఆనందంగా ఫీలవుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచే ఒకే రకమైన కథల చట్రంలో ఇరుక్కుపోయిన సాయి ధరమ్.. చంద్రశేఖర్ వల్ల కొత్త కథలో పాత్రలో కనిపించబోతారని ఆశిస్తున్నారు. ఈ సినిమా తొందరగా మొదలవ్వాలి కోరుకుంటున్నారు.