Samantha, Naga Chaitanya: నెట్టింట వైరల్ అవుతున్న చైసామ్ ఓల్డ్ ఫోన్ కాల్!

చైతన్యసమంతల విడాకుల ప్రకటన అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. చైసామ్ కలిసి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. చైతన్య హీరోగా తెరకెక్కిన ఏ మాయ చేశావె సినిమాతోనే సమంత టాలీవుడ్ కు పరిచయమయ్యారు. పెళ్లి తర్వాత పరిమితంగా సినిమాల్లో నటించిన సామ్ విడాకుల ప్రకటన తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అవుతుండటం గమనార్హం. విడిపోయిన తర్వాత చైతన్య సమంత వేర్వేరు ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. చైతన్య సమంత కలిసి నటించే అవకాశాలు అయితే దాదాపుగా లేవని సమాచారం.

అయితే చైసామ్ ఓల్డ్ ఫోన్ కాల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రారండోయ్ వేడుక చూద్దాం ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక షోకు నాగచైతన్య, రకుల్ గెస్టులుగా హాజరయ్యారు. ఆ షోలో ప్రదీప్ నాగచైతన్యను సమంతకు కాల్ చేయాలని కోరగా చైతన్య వెంటనే సామ్ కు కాల్ చేశారు. ఫోన్ కాల్ లో చైతన్య ప్రదీప్ అడగమన్నట్టుగా “ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా

8naga-chaitanya-with-his-wife

నేను సామ్ నే ఎందుకు లవ్ చేశాను” అని సమంతను అడగగా ‘నేను మరో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి’ అని సమంత సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చైతన్య నాకు మరో ఆప్షన్ కూడా అక్కర్లేదు అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆటోనగర్ సూర్య మూవీ సమయంలో చైసామ్ మధ్య ప్రేమ చిగురించగా 2017 సంవత్సరంలో వీళ్లిద్దరి మ్యారేజ్ జరిగింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!


‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.