2023 సంక్రాంతి పండుగకు మూడు భారీ సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో పోటీ ఊహించని స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. వారసుడు, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్లను సాధిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి రిలీజవుతున్న అన్ని సినిమాలకు చెప్పుకోదగ్గ రేంజ్ లో థియేటర్లు దక్కుతున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కాగా సంక్రాంతి సినిమాలలో వీరసింహారెడ్డి మూవీ 90 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా
వాల్తేరు వీరయ్య 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో వారసుడు మూవీ 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కాయని సమాచారం అందుతోంది. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకు 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమాకు చిరంజీవి 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా. విజయ్ మాత్రం జీఎస్టీతో కలిపి వారసుడు సినిమాకు 120 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని సమాచారం.
హీరోలు జీఎస్టీని కూడా నిర్మాతల నుంచి వసూలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ మూడు సినిమాలు నిర్మాతలకు విడుదలకు ముందే లాభాలను అందించాయని సమాచారం అందుతోంది. రిలీజైన తర్వాత ఈ మూడు సినిమాలు ఏ స్థాయిలో లాభాలను అందిస్తాయో చూడాల్సి ఉంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకే బ్యానర్ లో తెరకెక్కుతుండగా ఈ రెండు సినిమాలకు థియేటర్లను కేటాయించడం కష్టమవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ మూడు సినిమాలకు భారీ టార్గెట్ లు ఉండగా ఈ సినిమాల రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సినిమాలకు థియేటర్లను కేటాయించే విషయంలో ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.