రేపు ప్రభాస్ 25వ చిత్రం ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. ఫ్యాన్స్ అందరూ #Prabhas25 అనే హ్యాష్ ట్యాగ్ ను ఎలా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ చేయాలా అనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ మాంచి బిజీగా ఉన్నారు. నిజానికి ప్రభాస్ నటించిన 22వ చిత్రం కూడా ఇప్పటివరకూ రిలీజ్ అవ్వలేదు. అదే “రాధేశ్యామ్”, అలాంటిది 25వ సినిమా ఎనౌన్స్ చేయడం అనేది ఒకందుకు మంచిదే. ఈ స్పీడులో మరే ఇతర హీరో కూడా ఇప్పటివరకూ సినిమాలు ఎనౌన్స్ చేయలేదు.
అయితే.. ప్రభాస్ 25వ సినిమాను ఇప్పటికిప్పుడు అక్టోబర్ 7న అర్జెంట్ గా ఎనౌన్స్ చేయడానికి వెనుక కారణం టి-సిరీస్ అని తెలుస్తోంది. లాక్ డౌన్ టైంలో భారీ స్థాయిలో నష్టపోయిన ప్రొడక్షన్ కంపెనీల్లో టి-సిరీస్ ఒకటి. మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే థియేటర్లను పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసి.. బాలీవుడ్ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదల తేదీలు ప్రకటిస్తుండడంతో.. తమ బ్యానర్ నుంచి కూడా ఒక ప్రేస్టేజియస్ ప్రొజెక్ట్ ఎనౌన్స్ చేయాలి అనే కంగారులోనే ప్రభాస్ సినిమాను రేపు ఎనౌన్స్ చేయనున్నారు.
ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కేవలం ఒక స్టోరీ లైన్ మాత్రమే చెప్పాడు కానీ.. ఫుల్ స్టోరీ ఇంకా రెడీ అవ్వలేదు. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో “యానిమల్” సినిమాతో ఫుల్ బిజీలో ఉన్న సందీప్ రెడ్డి & టీం ఆ సినిమా అయిన తర్వాతే ప్రభాస్ 25వ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలెడుతుంది. అన్నీ సరిగ్గా కుదిరితే.. ఏడాదికి రెండు ప్రభాస్ సినిమాలు వస్తాయనే ఆనందం ప్రభాస్ అభిమానుల్లో ఉన్నప్పటికీ.. ఇంత కంగారుగా ప్రొజెక్ట్ ఎనౌన్స్ చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న కూడా కొందరిలో ఉంది.