కరోనా దేశానికి ఇచ్చిన కష్టం గురించి చెప్పుకోవాలంటే పేజీలు పేజీలు రాసుకోవాలి. మరి చేసిన మంచి గురించి చెప్పాలంటే వేళ్ల మీద లెక్కెట్టుకోవచ్చు. అలాంటి మంచిలో ఒకటి సోనూ సూద్ ఒకరు. కరోనా ఫస్ట్ వేవ్ నుండి ఆయన ఎంతో మందికి సాయం చేశారనేది లెక్కపెట్టలేం ఇప్పుడు సెకండ్ వేవ్‌లో ఆయన సేవ డబుల్ అయ్యింది. ఈ క్రమంలో ఆయనను అభిమానించేవాళ్లు బాగా పెరిగారు. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన కుర్రాడు కాలినడకన వెళ్లి సోనూ సూద్‌ను కలిశాడు.
వికారాబాద్‌కు చెందిన వెంకటేశ్ అనే యువకుడు సోనూ సూద్‌ను కలవడానికి కొన్ని రోజుల క్రితం ముంబయికి బయలుదేరాడు. ఏ కారో, బస్సో ఎక్కి కాదు… ఏకంగా కాలి నడకన వికారాబాద్ నుండి బయలుదేరాడు. ‘ది రియల్ హీరో సోనూ సూద్.. నా గమ్యం.. నా గెలుపు’ అంటూ ప్లకార్డు పట్టుకొని ముంబయి బయలుదేరాడు. 700 కిలోమీటర్ల ప్రయాణించి ఎట్టకేలకు ఇటీవల సోనూ సూద్‌ను కలుసుకున్నాడు. ఈ విషయాన్ని సోనూ ట్వీట్ చేశాడు. వెంకటేశ్‌తో దిగిన ఫొటోను కూడా ట్వీట్ చేశాడు.
వెంకటేశ్, నన్ను కలిసేందుకు హైదరాబాద్ నుంచి ముంబయికి నడుచుకుంటూ వచ్చాడు. తిరిగి అతను ఇంటికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాను. నాకు ఓ వైపు గర్వంగా ఉన్నప్పటికీ, ఇలాంటి చర్చలను నేను ప్రోత్సహించను. దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దు అంటూ సోనూ సూద్ పేర్కొన్నాడు. నిజమే కదా… అభిమానం చూపించడానికి ఇలా మహా పాదయాత్రలు చేయడం మంచిది కాదు. అభిమానం గుండెల్లో పెట్టుకోండి బ్రదర్స్.