రియల్ హీరో సోనూసూద్ ఈ మధ్య కాలంలో ఎంతోమందికి సహాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ పై అభిమానంతో కొంతమంది అభిమానులు తమ వ్యాపారాలకు సోనూసూద్ పేరును పెట్టుకుంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కు చెందిన సోనూసూద్ అభిమాని ఒకరు తన మటన్ దుకాణంలో మటన్ కొంటే ఆ డబ్బులలో కిలోకు 50 రూపాయల చొప్పున సోనూసూద్ ఛారిటబుల్ ట్రస్ట్ కు పంపుతానని పేర్కొన్నారు. ఈ విషయం తెగ వైరల్ కావడంతో పాటు సోనూసూద్ దృష్టికి వచ్చింది
సోనూసూద్ తాను శాఖాహారినని తన పేరుపై మటన్ షాపులో వ్యాపారం చేయడం ఏమిటని సోషల్ మీడియా వేదికగా చమత్కరించారు. ఆ వ్యక్తి శాఖాహార దుకాణం పెట్టుకుంటే తాను ఏమైనా సహాయం చేయగలనా..? అని సోనూసూద్ పేర్కొన్నారు. సోనూసూద్ కామెంట్లపై మటన్ వ్యాపారి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అభిమాని చేసిన పని సోనూసూద్ కు నచ్చలేదని ఆయన హర్ట్ అయ్యారని అర్థమవుతోంది. మరోవైపు సెకండ్ వేవ్ లో కరోనాతో ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు అవసరమైన మందులను పంపిస్తూ సోనూసూద్ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
సోనూసూద్ కర్నూలు గవర్నమెంట్ ఆస్పత్రిలో తొలి ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఏపీలోని ఇతర ప్రాంతాల్లో కూడా సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. రోజురోజుకు సోనూసూద్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం. సోనూసూద్ ను హీరోగా పెట్టి సినిమాలు తెరకెక్కించడానికి టాలీవుడ్ దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు