రాంచరణ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆంధ్రాలో అర్ధరాత్రి 1 గంట నుండి షోలు పడ్డాయి. ఇక తెలంగాణలో ఉదయం 4 గంటలకు షోలు పడ్డాయి. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్లో ఉంది. 5 ఏళ్ళ తర్వాత చరణ్ సోలో హీరోగా రూపొందిన సినిమా కావడంతో…థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సంబరాలు జరిపారు. అయితే ఒకింత మిక్స్డ్ గా ఉంది. కొంతమంది సినిమా ఆశించిన స్థాయిలో లేదు అంటున్నారు. ఇంకొంతమంది రొటీన్ అంటున్నారు.
Game Changer
మరికొంతమంది అయితే ‘ఇండియన్ 2’ కంటే బెటర్ అంటున్నారు. మార్నింగ్ షోలతో పోలిస్తే… మధ్యాహ్నం షోలకు టాక్ ఇంప్రూవ్ అయ్యింది. సో మొత్తంగా సినిమాకి ఇప్పుడు యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ మరీ ‘పుష్ప 2’ రేంజ్లో లేకపోయినా పర్వాలేదు అనే చెప్పాలి.
అయితే ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో చాలా ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. ఈ మధ్య ప్రతి పెద్ద సినిమాకి సీక్వెల్ ఉంటుందని చివర్లో అనౌన్స్ చేస్తున్నారు. కానీ దీనికి సీక్వెల్ ఉంటుందనే హింట్ ఏమీ ఇవ్వలేదు. ఇక సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అప్పన్న, పార్వతీ..లకు కొడుకు ఉన్నట్టు చూపించారు. అలాగే పార్వతీ ప్రెగ్నెంట్ అని కూడా చూపించారు.
అప్పన్న మర్డర్ అయ్యాక.. తర్వాత ఆమె ఏమైంది? ఆమె కొడుకు ఏమయ్యాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. అలాగే పార్వతీ పాత్రని చూసి షాక్ అయిన సత్యమూర్తి(శ్రీకాంత్) .. తండ్రి అప్పన్న పోలికలతో ఉన్న రామ్ నందన్ ను చూసి ఎందుకు షాక్ అవ్వలేదు. తర్వాత అతనికే ముఖ్యమంత్రి పదవి ఎందుకు కట్టబెట్టాడు? వంటి ప్రశ్నలకు దర్శకుడు శంకర్ సమాధానాలు ఇచ్చింది లేదు. బహుశా ‘నానా హైరానా’ సాంగ్ తో పాటు మరికొన్ని సన్నివేశాలు ఏమైనా యాడ్ చేసి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.