ఇటీవల వరుస సినిమాలు, ప్రమోషన్స్ తో హడావుడిగా కనిపించిన నాని ప్రస్తుతం చిన్న విరామం లో ఉన్నాడు. నిర్మాతగా కోర్ట్ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నప్పటికీ త్వరలోనే, మే 1న రిలీజ్ కానున్న హిట్ 3 (HIT3) ప్రమోషన్స్‌కి రెడీ అవుతున్నాడు. మరోవైపు, ద ప్యారడైజ్ (The Paradise) సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం కూడా రెడీ అవుతున్నాడు. ఇక ఈ మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తున్న నాని (Nani) , ఈ ఏడాది రెండో భాగం నుంచి మళ్లీ ఫుల్ స్పీడ్‌తో సినిమాల మీద ఫోకస్ పెట్టబోతున్నాడు.
ఈ గ్యాప్‌లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సినిమా ఎప్పుడు మొదలవుతుందనే క్వశ్చన్ మళ్లీ మొదలైంది. నాని కమ్ముల కాంబోపై చాలా రోజులుగా బజ్ ఉన్నా, ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, శేఖర్ కమ్ముల ప్రస్తుతం చేస్తున్న కుబేర (Kubera) సినిమా పూర్తయ్యాకనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట. ఆ సినిమా ఫినిష్ అవ్వగానే కమ్ముల స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంటాడట. జూన్‌లో కుబేర రిలీజ్ చేసే టార్గెట్ పెట్టుకున్న మేకర్స్.. తర్వాతే నాని ప్రాజెక్ట్ పై మూవ్ అవుతారట.
నాని (Nani) మాత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాకే పూర్తి డేట్స్ ఇస్తానని చెప్పాడట. ఎందుకంటే 2026కే రెడీ అవ్వాల్సిన రెండు ప్రాజెక్ట్స్ నానికి ఇప్పటికే లైన్ లో ఉన్నాయి . అందుకే కమ్ముల సినిమా షూటింగ్ 2025 చివరలో మొదలయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. ఇది పూర్తిగా సెన్సిబుల్ లవ్ స్టోరీ బేస్డ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. ఫిదా (Fidaa), లవ్ స్టోరీ (Love Story) లైన్‌లోనే కమ్ముల తీసే సినిమాగా బిల్డ్ చేస్తున్నారని టాక్. ఈ సినిమాను ఏషియన్ సునీల్ నిర్మిస్తుండటం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్.
గతంలో కూడా కమ్ముల సినిమాలకు ఆ బ్యానర్ బూస్ట్ ఇచ్చింది. ఇక నాని – కమ్ముల కాంబినేషన్ అంటే ఆడియన్స్‌లో మంచి కరేజ్ ఉంది. ఇద్దరి స్టైల్స్ వేర్వేరు అయినా.. కలిసే ప్లాట్‌లో తీయగలగడం కమ్ముల స్పెషాలిటీ. అందుకే ఈ సినిమా 2026 రిలీజ్‌కు డిసైడ్ అవుతుందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. హిట్ 3 రిలీజ్, తర్వాత నానికి సుజీత్ దర్శకత్వంలో మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా లైన్‌లో ఉంది. అంటే కమ్ముల ప్రాజెక్ట్‌కి నెక్స్ట్ ఇయర్ ఎటు పోతుందో అప్పుడే తెలుస్తుంది.