ఏప్రిల్ తొలి వారం టాలీవుడ్ (Tollywood) బాక్సాఫీస్ చాలా నీరసంగా గడిచింది. పెద్ద సినిమాల హడావుడి లేకపోవడంతో ఈ వారం ఎక్కువగా చిన్న బడ్జెట్ చిత్రాలు, రీ రిలీజ్ సినిమాలే థియేటర్లలో సందడి చేశాయి. అందులో లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) (LYF- Love Your Father), రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) శారీ (Saaree), 28 డిగ్రీ సెల్సియస్ (28 Degree Celsius) లాంటి చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే, వీటన్నిటికీ ప్రేక్షకుల నుంచి తక్కువ స్పందననే దక్కింది. ఒకవైపు, 34 ఏళ్ల క్రితం వచ్చిన బాలకృష్ణ (Nandamuri Balakrishna) క్లాసిక్ హిట్ ఆదిత్య 369 (Aditya 369) మళ్లీ థియేటర్లలోకి వచ్చింది.
భారీ హైప్‌తో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. కానీ విడుదలైన తర్వాత కలెక్షన్ల పరంగా మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. 4K వర్షన్‌గా సినిమాను రీ మాస్టర్ చేసి రిలీజ్ చేసినా, ప్రేక్షకులు పెద్దగా స్పందించలేదు. కొన్ని థియేటర్లలో ఒక్కో షోకి అరడజను మంది మాత్రమే వచ్చారని సమాచారం. ఇక మరోవైపు, ఆర్య 2 (Aarya 2) రీ రిలీజ్ కాస్త మెరుగ్గా ఆడింది.
హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు కలెక్షన్లు వచ్చినా, గతంలో రీ రిలీజ్ అయిన ఇతర స్టార్ హీరోల సినిమాల స్థాయికి మాత్రం రాలేకపోయింది. ప్రత్యేకంగా బన్నీ ఫ్యాన్స్ ఆశించిన హంగామా ఈసారి కనిపించలేదు. అయినా ఆదిత్య 369 కన్నా ఈ సినిమా కాస్త మెరుగ్గా నిలిచింది. వర్మ తీసిన తాజా చిత్రం శారీ కూడా ఘోరంగా ఫెయిలైంది. రిలీజ్ డే నుంచే థియేటర్లలో ఆడియెన్స్ లేకపోవడం ఆశ్చర్యంగా మారింది. దీంతో వర్మ ఫ్లాప్‌ల లిస్టులో మరో సినిమా చేరింది.
మిగిలిన చిన్న చిత్రాలు కూడా అలానే పోయాయి. థియేటర్లు ఖాళీగా కనిపించడంతో ఏ ఒక్క సినిమాకు కూడా బజ్ ఏర్పడలేదు. మొత్తానికి ఈ వారం టాలీవుడ్‌కి పూర్తిగా డల్ ఫేస్‌గా మిగిలింది. పైగా రీ రిలీజ్ సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోవడమే షాక్. వచ్చే వారం జాక్ (Jack), గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly), జాట్ (Jaat) లాంటి సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. మరి ఆ సినిమాలు ఎంతవరకు క్లిక్కవుతాయో చూడాలి.