మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నిన్ననే 70 వ ఏట అడుగు పెట్టారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా(ఆగస్టు 22న) ఆయన పుట్టినరోజుని ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. దానికి తోడు ‘ఇంద్ర’ (Indra) కూడా 4K లో రీ రిలీజ్ అవ్వడంతో వారి సెలబ్రేషన్స్ మరింత ఎక్కువగా కనిపించాయి. నిన్న చాలావరకు చిరంజీవి ప్రస్తావనే ఎక్కువగా వినిపించింది. ఆయన కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు ఎదుర్కొన్న సవాళ్ల గురించి.. ఎక్కువగా వార్తలు కనిపించాయి. ఇదే క్రమంలో చిరంజీవి కాఫీ కహానీ కూడా హైలెట్ అయ్యింది.
Chiranjeevi
చిరంజీవికి… కాఫీకి ఓ బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది. కొన్నేళ్లుగా కాఫీ అనేది చిరంజీవికి వింత పరీక్ష పెడుతుందట. విషయంలోకి వెళితే.. చిరంజీవి ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తారు. షూటింగ్ ఉందని తెలిస్తే.. టైంకి సెట్స్ కి వెళ్ళిపోతారట. ఇంట్లో వాళ్ళని ఆ టైంలో ఇబ్బంది పెట్టడం ఎందుకు అని.. షూటింగ్ స్పాట్లో కాఫీ తాగుదామని చిరు అనుకుంటారట. కానీ షూటింగ్ స్పాట్ కి వెళ్లి డైలాగ్ వెర్షన్ ప్రాక్టీస్ చేసి… ఒక షాట్ ఫినిష్ చేశాక కాఫీ తాగొచ్చులే అని ఆయన పోస్ట్ పోన్ చేస్తారట.
షాట్ ఫినిష్ చేసి.. నెక్స్ట్ షాట్ కి రెడీ అయ్యే గ్యాప్ లో కాఫీ చెబితే, అది తాగే టైంకి డైరెక్టర్ వచ్చి ‘సార్, షాట్ రెడీ అంటారట’. ‘మీరు కాఫీ తాగాక రండి’ అని దర్శకుడు చెప్పినా సరే… చిరు ఆగరట. ‘కాఫీ ఎప్పుడైనా తాగొచ్చు.. కానీ యూనిట్ సభ్యులను వెయిట్ చేయించడం ఇష్టం ఉండదు’ అని చెప్పి ఆయన నెక్స్ట్ షాట్ కి వెళ్ళిపోతారట. కొన్నేళ్లుగా ఇదే సీన్ రిపీట్ అవుతుందట. ‘విశ్వంభర’ (Vishwambhara) సెట్స్ లో కూడా ఇది మారలేదు అని స్పష్టమవుతుంది.