Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Vijay Devarakonda: దుల్కర్‌ సినిమా అలా అవ్వకూడదు.. విజయ్‌ కామెంట్స్‌ ఆ సినిమా మీదనేనా?

Vijay Devarakonda: దుల్కర్‌ సినిమా అలా అవ్వకూడదు.. విజయ్‌ కామెంట్స్‌ ఆ సినిమా మీదనేనా?

  • August 21, 2023 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: దుల్కర్‌ సినిమా అలా అవ్వకూడదు.. విజయ్‌ కామెంట్స్‌ ఆ సినిమా మీదనేనా?

‘కింగ్ ఆఫ్ కోథా’ ప్రచారం కోసం హైదరాబాద్‌లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న దుల్కర్‌ సల్మాన్‌ను ‘ఖుషి’తో ఎలాగైనా హిట్‌ కొట్టాలనుకుంటున్న విజయ్‌ దేవరకొండ ఇటీవల కలిశాడు. ‘ఖుషి’ విత్‌ ‘కింగ్‌ ఆఫ్‌ కోథ’ అంటూ ఓ ఇంటర్వ్యూ కూడా డిజైన్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరి సినిమాలకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పుకున్నారు. ఈ క్రమంలో విజయ్‌ చెప్పిన మాట ఆసక్తికరంగా మారింది, అదే సమయంలో ‘ఈ జాగ్రత్త అప్పుడుండాలి కదా విజయ్‌’ అనే కామెంట్‌ కూడా పడేలా చేసింది.

‘మహానటి’ సినిమాకు కలసి పని చేసినప్పటి నుండి విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ మంచి మిత్రులు. ఆ అనుబంధంతోనే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ జరిగింది. అయితే ఆల్‌ ది బెస్ట్‌ చెప్పుకునే క్రమంలో దుల్కర్‌ మాట్లాడుతూ ‘నా గత సినిమా ప్రేమ కథ. ఆ సినిమాలాగా నీ ‘ఖుషి’ కూడా విజయం సాధించాలి’ అన్నాడు. దానికి సమాధానంగా విజయ్‌ మాట్లాడుతూ ‘నా గత సినిమాలా కాకుండా నీ సినిమా మంచి విజయం అందుకోవాలి’ అని కోరాడు. దీంతో ఇప్పుడు ఆ మాటలు వైరల్‌ అయిపోయాయి.

విజయ్‌ (Vijay Devarakonda) గత సినిమా అంటే ‘లైగర్‌’ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఫలితం అతనిని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ సినిమా ఫలితం వల్ల ఆయనకు ఫ్లాపే వచ్చి ఉండాలి. కానీ ఆ సినిమా ప్రచారంలో ‘వాట్‌ లగాదేంగే’ అంటూ చేసిన హడావుడి వల్ల చెడ్డ పేరు వచ్చింది. యాటిట్యూడ్‌ చూపిస్తున్నాడు అని విమర్శకులు అంటే.. మరీ అంత అవసరం లేదని పరిశీలకులు అన్నారు. ఇక ట్రోలర్స్‌ అయితే పండగ చేసుకున్నారు.

ఇప్పుడు దుల్కర్‌తో మాట్లాడుతూ ఆ సినిమా బాలేదని చెప్పాడు. అయితే గతంలో ఆ సినిమా ప్రచారం అప్పుడు అంత హడావుడి చేయకపోయుంటే బాగుండేది కదా అని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. అప్పుడు అంతలా అనడం ఇందుకు, సన్నాయి నొక్కులు ఎందుకు అని కామెంట్లు పెడుతున్నారు. మరి విజయ్‌ ఏమంటాడో చూడాలి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Liger
  • #Vijay Deverakonda

Also Read

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Vijay Deverakonda: ఇంకెన్నాళ్లు ఇదే పబ్లిసిటీ దేవరకొండ?

Kingdom: విజయ్‌ దేవరకొండ సినిమాకు తమిళనాట నిరసనలు.. ఏమైందంటే?

Kingdom Review in Telugu: “కింగ్డమ్” సినిమా రివ్యూ & రేటింగ్!

Kingdom Twitter Review: ఆ 20 నిమిషాలు మెంటల్ మాస్ అట

తెలుగులో జెండా పాతనున్న మరో మలయాళీ యాక్టర్

Vijay Deverakonda: కొత్త కుంపటి రాజేసిన విజయ్‌ దేవరకొండ.. ఫ్యాన్ వార్స్‌కి కారణమవుతుందా?

trending news

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

Sundarakanda Review In Telugu: సుందరకాండ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

12 hours ago
War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

13 hours ago
‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

14 hours ago
Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

15 hours ago

latest news

Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

14 hours ago
Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ ఫస్ట్ రివ్యూ….నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడిందా లేదా?

Sreelela: శ్రీలీల ఫస్ట్‌ సినిమా.. ఇలాంటి ట్విస్ట్‌ ఇచ్చారేంటి? అయిత ఒకందుకు మంచిదే?

19 hours ago
Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version