టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన వినయ్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కథ మార్చినా కొన్నిసార్లు షూట్ లో పాల్గొన్నానని వినయ్ వర్మ తెలిపారు. ఒక పాత్ర చెప్పి ఆ పాత్రను మార్చడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. షాట్ మధ్యలో ఫోన్ మ్రోగితే కోపం వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రాలేదని వినయ వర్మ తెలిపారు. నా ఫస్ట్ రెమ్యునరేషన్ 1500, 2000 అలా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటి రెమ్యునరేషన్ చెప్పమంటే మేనేజర్ నంబర్ ఇస్తానని వినయ్ వర్మ తెలిపారు. క్యారెక్టర్ ను బట్టి రెమ్యునరేషన్ లో మార్పులు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారని అనుకుంటున్నానని వినయ్ వర్మ వెల్లడించారు. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చేయడం నాకు ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. వీరసింహారెడ్డి సినిమాలో నాకు ఛాన్స్ వచ్చిందని అయితే ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశానని వినయ్ వర్మ పేర్కొన్నారు.
వీరసింహారెడ్డి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య తండ్రి పాత్రలో నటించాలని గోపీచంద్ మలినేని కోరారని అయితే బాలయ్య తండ్రి పాత్రలో నటించడం ఇష్టం లేక ఆ ఆఫర్ కు నో చెప్పానని వినయ్ వర్మ వెల్లడించడం గమనార్హం. వినయ్ వర్మ చేసింది రైట్ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వినయ్ వర్మ ప్రస్తుతం తెలుగులో వేర్వేరు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.
వినయ్ వర్మ (Vinay Varma) రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. వినయ్ వర్మ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత బిజీ కావాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగు బాగా మాట్లాడుతూ వినయ్ వర్మ అభిమానులకు మరింత దగ్గరవుతూ ఉండటం గమనార్హం. వినయ్ వర్మ తెలుగు సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.