2023 సంక్రాంతికి భారీ పోటీ నడుమ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకున్న ఏకైక చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మిగిలిన సినిమాలు అన్నీ వాటి స్థాయికి తగ్గట్టుగా కలెక్ట్ చేసి కామ్ అయిపోయాయి కానీ ‘వాల్తేరు వీరయ్య’ మాత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నిర్మాతలతో పాటు ప్రతి బయ్యర్ కు భారీ లాభాలను అందించాయి. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి.
బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో చిరుతో పాటు రవితేజ కూడా ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి చాలా కాలం తర్వాత ఎనర్జిటిక్ గా నటించి అభిమానులను సంతృప్తి పరిచారు. ‘సైరా’ ‘ఆచార్య’ ‘గాడ్ ఫాదర్’ చిత్రాల ఫలితాలతో బాక్సాఫీస్ వద్ద కాస్త వెనుకపడ్డ చిరు తిరిగి ‘వాల్తేరు వీరయ్య’ తో పుంజుకున్నారు. ఇక థియేటర్లలో సూపర్ సక్సెస్ అందుకున్న ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీకి ఎప్పుడు వస్తుంది అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.
‘పూనకాలు లోడింగ్’ ను ఇంకోసారి ఆస్వాదించాలని కొందరు.. థియేటర్లలో మిస్ అయిన ఆడియన్స్ మరికొందరు ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27 నుండి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అంటే 45 రోజుల తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందన్న మాట. ఇక ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.