పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో నిదానంగానే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీమేక్ సినిమాలను పవన్ కళ్యాణ్ ఎంచుకుంటున్నా రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో పవన్ సినిమాలు రిలీజ్ కావడానికి ఆలస్యమవుతోంది. అయితే వరుస సినిమాలను ప్రకటిస్తున్న పవన్ షూటింగ్ విషయంలో ప్రభాస్ ను ఫాలో కావాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలకు డేట్లు కేటాయిస్తున్నారు. ప్రతి నెలా ఒక్కో సినిమాకు 10 రోజులు డేట్లు కేటాయించేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నారు.
మిగిలిన రోజుల్లో ఇతర ఆర్టిస్టులకు సంబంధించిన సన్నివేశాలు, సెట్స్ వర్క్ జరుగుతున్నాయి. ఈ విధంగా చేయడం ద్వారా వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన మూడు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే పరిస్థితులు ఉన్నాయి. పవన్ కూడా వేగంగా సినిమాలలో నటిస్తే పవన్ సినిమాలు కూడా ఒకే ఏడాది రెండు లేదా మూడు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ అంతే వేగంగా షూటింగ్ లను పూర్తి చేసి సినిమాలను రిలీజ్ చేస్తే పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా హరిహర వీరమల్లుకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ 50 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ గా అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమాలను నిర్మించడానికి చాలామంది నిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత పవన్ సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తారో లేక రాజకీయాల్లో కెరీర్ ను కొనసాగిస్తారో చూడాల్సి ఉంది.
పవన్ కు జోడీగా నటించే హీరోయిన్లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే ఏడాది పవన్ హీరోగా తెరకెక్కుతున్న రెండు సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.