నందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ`. ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ‘సింహా’ ‘లెజెండ్’ కాంబో కావడం పైగా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న పెద్ద చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నమోదయ్యాయి. దాంతో థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.
వాటి వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం
11.00 cr
సీడెడ్
11.00 cr
ఉత్తరాంధ్ర
5.80 cr
ఈస్ట్
3.95 cr
వెస్ట్
3.44 cr
గుంటూరు
5.48 cr
కృష్ణా
3.82 cr
నెల్లూరు
1.89 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
46.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
4.40 cr
ఓవర్సీస్
2.47 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
53.25 cr
‘అఖండ’ చిత్రానికి రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సెకండ్ వేవ్ తర్వాత ఇంత భారీ బిజినెస్ జరిగింది ఈ చిత్రానికి మాత్రమే. అయితే ‘అఖండ’ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.54 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆంధ్రలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల రీత్యా అయితే ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. బాలకృష్ణ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. ఆ చిత్రం కలెక్ట్ చేసింది కూడా కేవలం రూ.50 కోట్ల షేర్ మాత్రమే.