‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ‘నిజం’ ‘నాని’ వంటి సినిమాలు చేశాడు మహేష్ బాబు. ఒకసారి మాస్ ఫాలోయింగ్ వచ్చిన తరువాత కూడా ఇలాంటి సినిమాలు చేయాలని ఓ హీరో డిసైడ్ అవ్వడం సాహసమనే చెప్పాలి. అయితే ఫలితాలు మాత్రం తేడా కొట్టేశాయి. ‘నిజం’ సినిమా భారీ అంచనాల నడుమ నలిగిపోతే.. ‘నాని’ మాత్రం ప్రయోగం మరీ ఓవర్ డోస్ అవ్వడం వలన ప్లాప్ అయ్యింది అని విశ్లేషకులు చాలా సార్లు చెప్పారు.2004 వ సంవత్సరం మే 14న ఈ చిత్రం విడుదలైంది.
ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది.ఇదిలా ఉండగా.. ఇదే చిత్రాన్ని తమిళంలో కూడా తెరకెక్కించాడు దర్శకుడు ఎస్.జె.సూర్య. అక్కడ మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. పైగా ఎస్.జె.సూర్య నే హీరోగా నటించిన ‘న్యూ’ చిత్రం 2004 టైంలోనే రూ.30 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించలేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ‘నాని’ సినిమా విడుదల రోజున కృష్ణ గారు ఈ చిత్రాన్ని చూసిన తరువాత మహేష్ బాబుతో ‘ఈ సినిమా హిట్ అయితే మహేష్ బాబు స్టార్ కాదు.. హిట్ అవ్వకపోతేనే మహేష్ బాబు స్టార్ అయినట్టు’ అని చెప్పారట.
అంటే స్టార్ హీరోలు ప్రయోగాలు చేస్తే చూడరు అని కృష్ణ గారి ఉద్దేశం కావచ్చు. 300 సినిమాలకు పైగా సినిమాల్లో నటించారు కాబట్టి.. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఆయనకు ఎదురై ఉండవచ్చు. ఇక ఈ చిత్రానికి మహేష్ సోదరి మంజుల నిర్మాత అన్న సంగతి తెలిసిందే. ఆమెకు ఈ చిత్రం 2 రెట్లు నష్టాల్ని మిగిల్చిందట. మహేష్ బాబు ఈ సినిమాకి పారితోషికం తీసుకోలేదట. అయితే వీరిద్దరి కాంబినేషన్లో 2006లో వచ్చిన ‘పోకిరి’ మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి 5 రెట్ల లాభాలను అందించిందట. ‘నాని’ కి వచ్చిన నష్టాలు ‘పోకిరి’ తీర్చినట్టు తెలుస్తుంది.