ఓ బ్లాక్ బస్టర్ సినిమా పక్కన మరో మంచి సినిమా వచ్చినా.. దాని పక్కన నిలబడుతుంది అని చెప్పలేం. ఇందుకు చాలా ఎగ్జామ్పుల్స్ ఉన్నాయి. ‘పోకిరి’ టైంలో రవితేజ (Ravi Teja) ‘విక్రమార్కుడు’ వచ్చింది. కానీ ‘పోకిరి’ రేంజ్లో ఆ సినిమా బ్లాక్ బస్టర్ కాలేదు. ఎందుకంటే ‘పోకిరి’ బాక్సాఫీస్ రన్ స్లోగా మొదలైంది. 4 వారాల పాటు పెద్దగా హడావుడి లేదు.
తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. 100 రోజుల వరకు ‘పోకిరి’ ప్రదర్శిస్తున్న థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడిపోయాయి. ఆ టైంలో రవితేజ ‘విక్రమార్కుడు’ వచ్చింది. అది సూపర్ హిట్ సినిమానే. కానీ ‘పోకిరి’ రేంజ్లో కలెక్ట్ చేయలేదు. అలాగే కొన్నాళ్ల తర్వాత ‘దూకుడు’ వచ్చింది. దాని పక్కన ‘ఊసరవెల్లి’ వచ్చింది. కానీ ‘దూకుడు’ మేనియాలో అది నిలబడలేదు.
సో ఇలా ఓ సినిమా భీభత్సమైన కలెక్షన్స్ తో దూసుకుపోతున్న టైంలో వేరే సినిమా వస్తే.. దాని హవా కొంచెం తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ‘ఊసరవెల్లి’ లా తేలిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. 2012 లో ఇలాంటి సందర్భమే చోటు చేసుకుంది. మే 11న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘గబ్బర్ సింగ్’ సినిమా రిలీజ్ అయ్యింది. ఇది బ్లాక్ బస్టర్ సినిమా.
50 రోజుల వరకు దీని పక్కన ఏ సినిమా వచ్చినా తట్టుకుని నిలబడింది లేదు. అలాంటి టైంలో రవితేజ ‘దరువు’ వచ్చింది. సిరుతై శివ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. రొటీన్ కంటెంట్ అయినా.. టైం పాస్ చేయించే విధంగానే ఈ సినిమా ఉంటుంది. కానీ ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ధాటికి ఇది తట్టుకోలేకపోయింది. డిజాస్టర్ గా మిగిలిపోయింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 13 ఏళ్ళు పూర్తి కావస్తోంది.