#SSMB28… ఈ సినిమా గురించి చాలా రోజుల నుండి వార్తలు వింటూనే ఉన్నాం. సినిమా అంతా ఓకే అయింది అని అనౌన్స్‌మెంట్ చేశారు. కానీ సినిమా ముహూర్తం జరుపుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఆ తర్వాత సినిమా మొదలైంది.. కానీ రెగ్యులర్ షూటింగ్ కోసం చాలా రోజులు ఆగాల్సి వచ్చింది. మొదలైంది అనుకునేసరికి తొలి షెడ్యూల్ అయ్యాక రెండో షెడ్యూల్ కోసం చాలా రోజులు ఆగాల్సి వచ్చింది. ఆ కారణాల సంగతి తర్వాత చూస్తే.. ఇప్పుడు సినిమా పేరు గురించి చర్చ నడుస్తోంది.
సినిమాకు (SSMB28) పేరు పెట్టడానికి చాలా చర్చలు జరుగుతాయి. అయితే ఈ సినిమా గురించి చాలా చాలా చర్చలు జరుగుతున్నాయి అని చెప్పాలి. రకరకాల పేర్లు బయటకు వినిపిస్తున్నా.. ఇంకా ఏ పేరు కూడా ఫిక్స్ కాలేదు. దీంతో సినిమా పేరు కోసం ఇంతగా చర్చలు జరగాలా అనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న పేరు మహేష్‌బాబు ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చేది అని చెప్పొచ్చు. అదే ‘ఊరికి మొనగాడు’. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. ఇంకేంటి సూపర్ స్టార్ కృష్ణ సినిమా టైటిలే ఇది.
కృష్ణ సినిమాల్లో ‘ఊరికి మొనగాడు’ చాలా స్పెషల్ అని చెప్పాలి. అలాంటి పేరును ఇప్పుడు మహేష్ సినిమాకు వాడుకుంటున్నారట. ఈ మేరకు త్రివిక్రమ్ టీమ్ చర్చలు జరుపుతోందట. ఈ నెల 31న ఈ మేరకు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు అని అంటున్ఆరు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌తో చిన్న టీజర్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. ఈ పేరుకు ముందు ‘అమరావతికి అటు ఇటు’, ‘గుంటూరు మిర్చి’ లాంటి పేరు్లు కూడా వినిపించాయి.
కానీ వాటి కంటే ‘ఊరికి మొనగాడు’ పేరు బాగుంటుంది అని అనుకుంటున్నారట. మహేష్ అందుబాటులోకి వచ్చాక టైటిల్ విషయంలో క్లారిటీ వస్తుందని, అప్పుడు వీడియో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తారట. ఈ వీడియోలో ప్రత్యేకంగా కొత్తగా ఏం చెప్పరని, పోస్టర్‌లో ఉన్న మిర్చి మార్కెట్ నేపథ్యంలోనే ఉంటుందని చెబుతున్నారు.