సినిమా రంగంలో బండ్ల గణేష్ ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ ను మొదలుపెట్టి కెరీర్ లో అంతకంతకూ ఎదిగిన సంగతి తెలిసిందే. సినిమాల్లో ఎక్కువగా కమెడియన్ రోల్స్ లో నటించిన బండ్ల గణేష్ నిర్మాతగా మారిన తర్వాత పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ట్విట్టర్ కు గుడ్ బై చెబుతున్నట్టు కీలక ప్రకటన చేసిన బండ్ల గణేష్ వేర్వేరు కారణాల వల్ల మనస్సు మార్చుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా బండ్ల గణేష్ పేరు సంపాదించుకున్నారు.
అయితే బండ్ల గణేష్ గతంలో జనసేన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా బండ్ల గణేష్ జనసేన పార్టీలో చేరకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. చిన్నప్పటి నుంచి తాను కాంగ్రెస్ పార్టీకి అభిమాననినని ఆ రీజన్ వల్లే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. తనకు పవన్ కళ్యాణ్ అంటే కృతజ్ఞతా భావం అని బండ్ల గణేష్ వెల్లడించారు. కాంగ్రెస్ తనకు తల్లితండ్రిలాంటి పార్టీ అని బండ్ల గణేష్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం తనవంతుగా తాను ప్రయత్నాలు చేశానని అయితే పార్టీ గెలవలేదని బండ్ల గణేష్ అన్నారు. బొత్స సత్యనారాయణ తనకు స్నేహితుడు అని తమ పూర్వీకులు గుంటూరు జిల్లాకు చెందినవారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. బొత్స సత్యనారాయణతో తాను కలిసి తిరుగుతూ ఉండటం వల్ల ఆయన బినామీ అనే ముద్ర పడిందని తనకు వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ పై నమ్మకం ఉందని అందుకే అతనికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చానని బండ్ల గణేష్ తెలిపారు.