సినిమా పోస్టర్లను, మీమ్స్‌ను వాడుకుని ప్రజలను పోలీసులు అలెర్ట్ చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. అందరికీ నచ్చే వాళ్లతో మంచి చెబితే బాగా గుర్తుపెట్టుకుంటారు, ఆచరిస్తారు అని పోలీసులు అనుకుంటుున్నారామో. మన దగ్గర కూడా ఇటీవల ఒకటి, రెండు ఇలాంటి పోలీసుల సోషల్ మీడియా పోస్టులు చూశాం. దీనిని ఫాలో అయ్యారో, వాళ్లకే వచ్చిందో ఈ ఆలోచన కానీ… తాజాగా కేరళ పోలీసులు ఓ సినిమా హీరో ను అవేర్‌నెస్ కూడా వాడేశారు. అక్కడి హీరో అయితే మనకెందుకు అంటారేమో.. వాడింది మన హీరోనే. అల్లు అర్జున్ అదేనండి మల్లు అర్జున్.
స్టైలిష్‌స్టార్‌కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కేరళలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. సినిమా విడుదల అంటే చాలు బ్యానర్లు, సందళ్లు మామూలుగా ఉండవు. కొంతమంది అభిమానులు అయితే అక్కడి నుంచి ఇక్కడి వచ్చి మరీ కలుస్తుంటారు బన్నీని. మన దగ్గర ఎలా కటౌట్లు పెడతారో, కేరళలో బన్నీ సినిమాలు వస్తే అక్కడా అలాగే పెడతారు. ఈ క్రేజ్‌నే అవేర్‌నెస్ కోసం వాడాలని కేరళ పోలీసులు నిర్ణయించారు. ఇటీవల కేరళ పోలీసులు పోల్ యాప్ పేరుతో ఓ యాప్‌ను సిద్ధం చేశారు. ఈ యాప్ ప్రమోషన్ కోసం ‘రేసుగుర్రం’లో అల్లు అర్జున్ పోలీస్ గెటప్‌లో ఎంట్రీ ఇచ్చిన సీన్‌ను ఉపయోగించుకున్నారు.
ఆ యాప్‌లో పెట్టిన వీడియోను కేరళ పోలీస్ విభాగం ఇటీవల ట్విటర్ షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మలయాళంలో ఇంతమంది సూపర్ స్టార్స్ ఉండగా, అల్లు అర్జున్ వీడియోనే వాడడం అతనికి అక్కడ ఉన్న అభిమానం ఎంతో చూపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఏదైతేముంది మన హీరోలు ఇతర రాష్ట్రాల్లో కూడా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. సినిమా వసూళ్ల పరంగా, అవేర్‌నెస్ పరంగా కూడా. మీరూ పనిలో పనిగా ఈ వీడియో చూసేయండి.