ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక బాలయ్య.. కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకూ మనకి వీళ్ళ గురించి తెలిసిన అప్డేట్ ఇదొక్కటే..! అయితే ఎవ్వరూ ఊహించని విధంగా వీరిద్దరూ ఒకే వేదిక పై కనబడనున్నారట. అంతేకాదండోయ్ వీరితో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా వీరితో పాటూ కనిపించబోతున్నారట. వినడానికి ఎంతో ఆశ్చర్యంగానూ ఎంతో ఆసక్తిగానూ ఉంది కదూ. అయితే ఇదంతా ఎలా సాధ్యం అనేగా మీ డౌట్?
వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత… చిత్ర పరిశ్రమకు ప్రతి సంవత్సరం అందించే నందీ అవార్డుల ప్రధానోత్సవం జరగలేదు.
2014,2015, 2016 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల విజేతలని ప్రకటించి చాలా రోజులైనా… ఇంతవరకూ వారికి అందజేయలేదు. ఇప్పుడు కొత్తగా వైసిపి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి… పెండింగ్ లో ఉన్న నంది అవార్డుల వేడుకని త్వరలోనే నిర్వహించి అవార్డులను అందజేయాలని ముఖ్యమంత్రి జగన్ ప్లాన్ చేస్తున్నారట. 2014 సంవత్సరానికి ఉత్తమ నటుడిగా బాలకృష్ణ ఎంపికయ్యారు. ‘లెజెండ్’ చిత్రానికి గాను బాలయ్య ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోబోతున్నారు. ఇక 2015లో ‘శ్రీమంతుడు’ చిత్రానికి మహేష్ బాబు, 2016లో నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలకు జూ. ఎన్టీఆర్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఈ రకంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవార్డుల వేడుకలో ఎన్టీఆర్, బాలకృష్ణ, వైఎస్ జగన్ లను ఒకే వేదిక పై చూసే అవకాశం ఉందన్న మాట.