‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.1700 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ పోస్టర్స్ ద్వారా రివీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ‘పుష్ప 2’ కలెక్షన్స్ తో క్రియేట్ చేసిన రికార్డులతో కంటే.. సంధ్య థియేటర్ ఘటనతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ చనిపోయింది. అలాగే ఆమె కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
దీంతో అల్లు అర్జున్ (Allu Arjun) పై కేసు నమోదవ్వడం, అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం కూడా జరిగాయి. ఇక మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ.. అల్లు అర్జున్ ఈ గొడవలతో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాయర్.. ఈ తొక్కిసలాటకి కారణం తెలంగాణ పోలీసులు అంటూ వాళ్ళని కోర్టులో కార్నర్ చేయడం వల్ల.. ఈ కేసును వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈరోజు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారించడం జరిగింది.
ఇలాంటి పరిస్థితుల్లో ‘పుష్ప 2’ సినిమాలో.. విలన్ భన్వర్ సింగ్ షెకావత్(ఫహాద్ ఫాజిల్) ని రెచ్చగొడుతూ ఓ స్లోగన్ ఉంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద వచ్చే చిన్న బిట్ సాంగ్ ఇది. “షెకావత్ సారూ.. సారీ, దమ్ముంటే పట్టుకోరా షెకావత్తు , పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్టు, మళ్ళీ భుజాన గొడ్డలిసి.. కూలీగా పోతా అడవికేసి” అంటూ సాగే బిట్ సాంగ్ ఇది.
అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న సందర్భంలో.. ఆ పాటను విడుదల చేసి ‘పుష్ప 2’ టీం ఏం చెప్పాలనుకుంటుంది. సోషల్ మీడియాలో ఈ పాటతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హైదరాబాద్ పోలీసులను ట్రోల్ చేస్తే.. వాళ్ళు ఇంకా హర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా..! సరే మీరైతే ఈ లిరికల్ సాంగ్ ని ఒకసారి వినండి :