టాలీవుడ్లో అపజయమెరుగని దర్శకులుగా ఇప్పటివరకు రాజమౌళి పేరును మాత్రమే ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చాము. ఆ తర్వాత కొరటాల శివ 4 సినిమాల వరకు సక్సెస్ లు అందించాడు కానీ 5 వ సినిమా అయిన ‘ఆచార్య’ వద్ద దొరికిపోయాడు. దీంతో ఇక ఆ రికార్డుని ఏ డైరెక్టర్ కొనసాగించలేడు అని అంతా అనుకుంటున్న టైం అనిల్ రావిపూడి.. ఆ రికార్డుకి దగ్గరగా వచ్చినట్టు స్పష్టమవుతుంది. అనిల్ ట్రాక్ రికార్డు చూసుకుంటే.. ఇప్పటికి 6 సినిమాలు చేశాడు.
అవే ‘పటాస్’ ‘సుప్రీమ్’ ‘రాజా ది గ్రేట్’ ‘ఎఫ్ 2 ‘ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘ఎఫ్3 ‘ ‘భగవంత్ కేసరి’..! ‘ఎఫ్ 3 ‘ యావరేజ్ రిజల్ట్ నే అందించినా మిగిలినవన్నీ హిట్లే..! ఇటీవల రిలీజ్ అయిన ‘భగవంత్ కేసరి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద స్లోగా స్టార్ట్ అయినా సాలిడ్ రన్ ను కొనసాగిస్తుంది. ఈరోజుతో ఆ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసింది. దీంతో అనిల్ రావిపూడి కెరీర్లో ఓ రేర్ రికార్డు వచ్చి చేరినట్టు అయ్యింది.
అదేంటి అంటే.. ‘భగవంత్ కేసరి’ తో (Anil Ravipudi) అనిల్ రావిపూడి ఖాతాలో వరుసగా 4 వ రూ.100 కోట్ల సినిమా రిజిస్టర్ అయ్యింది. ‘ఎఫ్ 2 ‘ నుండి ‘సరిలేరు నీకెవ్వరు’ ‘ఎఫ్ 3 ‘ ఇప్పుడు ‘భగవంత్ కేసరి’ ఇలా 4 సార్లు వంద కొట్టాడు అనిల్ రావిపూడి. ప్రేక్షకులకి ఎలాంటి ప్రెజెంటేషన్ నచ్చుతుందో అనిల్ కి బాగా తెలుసు. మరి రాజమౌళిలానే అనిల్ కూడా సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తాడో లేదో చూడాలి