ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి సలార్ సినిమా మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రభాస్ రంగంలోకి దిగి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. దీంతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సలార్ టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఒక ఫోటో వైరల్ గా మారింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ఏ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
దీంతో ప్రభాస్ ఫాన్స్ సలార్ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి లిరికల్ సాంగ్ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా దర్శకతీరుడు ఎస్ఎస్ రాజమౌళి సలార్ టీమ్ ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. డైరెక్టర్ ప్రశాంత్, ప్రభాస్ పృథ్వీ రాజ్ సుకుమార్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారని తెలుస్తుంది. త్వరలోనే ఈ వీడియో విడుదల కానుంది.
ఇక ఈ సినిమా నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ వారు కొనుగోలు చేయడంతో మైత్రి మూవీ ప్రొడ్యూసర్ కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు. (Rajamouli) రాజమౌళి ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈయన శుక్రవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే షో కి సంబంధించిన టికెట్ కొనుగోలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.